Begin typing your search above and press return to search.

పిల్లలను కనండి.. మిలటరీ నుంచి మినహయింపు పొందండి

By:  Tupaki Desk   |   27 March 2023 7:00 PM GMT
పిల్లలను కనండి.. మిలటరీ నుంచి మినహయింపు పొందండి
X
దక్షిణ కొరియా దేశంలో జనాభా తక్కువ. దీంతో పుట్టిన ప్రతివారు అక్కడ సైన్యంలో కొద్దిరోజులు పనిచేయాల్సిందే.. తప్పనిసరిగా సైనిక సేవ చేయాలనే కఠినమైన విధానాన్ని ఆ దేశం నిర్వహిస్తోంది. ఇందుకోసం 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులందరూ దాదాపు 18 నుండి 21 నెలల పాటు సాయుధ దళాలలో సేవ చేయవలసి ఉంటుంది. అయితే నియమానికి కొత్త మినహాయింపు ఇవ్వడానికి సౌత్ కొరియా సిద్ధమైంది.. పురుషులు 30 ఏళ్లు వచ్చేలోపు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే అధికారులు ఈ మిలటరీలో తప్పనిసరి సేవ నుండి వారిని మినహాయిస్తామని ప్రకటించారు. దేశంలో పడిపోతున్న జనాభాను పునరుద్దరించడానికి ఇలాంటి ఆఫర్ ను యువతకు ఇచ్చారు. మిలటరీలో పనిచేయలేమనుకునే వారు పిల్లలను కంటే ఈ శిక్షణ సేవ నుంచి తప్పించుకోవచ్చు.

దేశంలో పడిపోతున్న జనన రేటును పెంచడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో దేశం ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటును నమోదు చేసింది. ఈ సంఖ్య కొత్త కనిష్టానికి పడిపోయింది.

మార్చి 22న దక్షిణ కొరియా పాలక సంప్రదాయవాద పీపుల్ పవర్ పార్టీ జననాలను పెంచే సంప్రదాయేతర మార్గాలను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రణాళికలు ఖరారు కానప్పటికీ, ప్రస్తుతం వాటిని సమీక్షిస్తున్నారు. కొరియాలోని సియోల్ ఆధారిత మిలిటరీ హ్యూమన్ రైట్స్ సెంటర్‌లో కోఆర్డినేటర్ చో క్యు-సుక్ మాట్లాడుతూ, ఈ ప్రతిపాదన యువకులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని... మరిన్ని జననాలకు అడ్డంకిని కూడా తొలగిస్తుందని చెప్పారు.

ఎక్కువ మంది యువతను సైన్యానికి సేవ నుండి తప్పించాలనే ప్రతిపాదనకు చాలా ఎదురుదెబ్బ తగిలింది. ''మీరు యుక్తవయస్కులను పిల్లలను కనాలని ప్రోత్సహిస్తున్నారా?'' ''మిలిటరీకి వెళ్లకుండా ఉండటానికి ముగ్గురు పిల్లలను ఎవరు కంటారు?'' అంటూ సోషల్ మీడియాలో యువకులు మండిపడుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

యువకులు పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండాలని ప్లాన్ చేస్తే వారు భరించాల్సిన అవాంఛిత ఖర్చులను కూడా కొందరు ఎత్తి చూపారు. చాలా మంది నిపుణులు ఈ ఆలోచనను ''ప్రమాదకరమైనది'' , "భరించలేనిది" అని కూడా పేర్కొన్నారు.

దేశంలో తక్కువ మంది ప్రజలు సహజీవనం చేస్తూ ఒంటరిగా ఉండిపోతున్నారు. తక్కువ వివాహాలు , జనన రేట్లు నమోదవుతున్నాయి. జంటలు పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదు.ఖర్చులు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా భావిస్తూ అవైడ్ చేస్తున్నారని.. బహుళ కారణాలు పిల్లలను కనకపోవడానికి ఉన్నాయని నిపుణులు అంటున్నారు, అధిక పిల్లల పెంపకం ఖర్చులు , ఆస్తి తక్కువ, ధరల పెరుగుదల. మంచి జీతం లేకపోవడం.. ఉద్యోగాలను పొందడం కష్టతరం చేసే పరిస్థితులు ఉండడంతోనే పిల్లలను ఎవరూ కొరియాలో కనడం లేదని తేలింది.

పని చేసే తల్లులు తమ వృత్తిని కొనసాగిస్తూనే ఇంటి పనులు, పిల్లల సంరక్షణ భారాన్ని మోయడానికి రెట్టింపు భారం పడటం కారణంగానే పిల్లలంటే అయిష్టత చూపుతున్నారని నిపుణులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.