భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సూచించిన రిజర్వేషన్లకు పదేళ్ల కాల పరిమితి ఉందని ఒకవేళ పదేళ్ల తర్వాత కూడా ఎస్సీ ఎస్టీల స్థితిగతులు మెరుగపడకుంటే ప్రతి పదేళ్లకోసారి ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఆయన సూచించారన్న సంగతి చాలామందికి తెలియదు. అయితే అంబేడ్కర్ రాజ్యాంగం రూపొందించిన సమయంలో పరిస్థితులు... ఇప్పటి పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయన్నది జగమెరిగిన..చంద్రబాబు 'జగన్' ఎరిగిన సత్యం.
ఇంకా ఎస్సీ ఎస్టీల స్థితిగతులో మార్పులు రాలేదని ఎస్సీ ఎస్టీలలో ఉన్న భావనతో కావచ్చు ఓటు బ్యాంకు రాజకీయాలు కావొచ్చు...ఇంకా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను కొనసాగుతున్నాయి.
దీనిపై అగ్రవర్ణాల వారు కాస్త గుర్రుగా ఉన్నప్పటికీ... రాజకీయ నాయకులు మాత్రం తేనెతుట్టె వంటి రిజర్వేషన్ల వ్యవహారాన్ని కదిల్చేందుకు ఏ రాజకీయ నాయకుడూ సాహసించడం లేదు. అంతేకాదు గతంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ల శాతంలో మార్పులు చేర్పులు చేయడానికి కూడా సుముఖంగా లేరు.
కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం... ట్రెండ్ కు భిన్నంగా ఇటీవల అసెంబ్లీలో సంచలన బిల్లు ఒకటి పాస్ చేశారు. బోయలను వడ్డెరలను ఎస్సీలలో చేర్చాలని దళిత క్రిస్టియన్లకు ఎస్సీ సామాజిక వర్గంలో ప్రాధాన్యతన కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ను టచ్ చేయడానికి వీల్లేదంటూ ఆయా సామాజిక వర్గాల వారు ఆక్షేపిస్తున్నారు. వారికి రిజర్వేషన్లు కల్పించడమంటే తమ రిజర్వేషన్లలో కోత పడడమేనని వారు భావిస్తున్నారు.
దీంతో రాబోయే ఎన్నికలకు ముందు ఈ రిజర్వేషన్ల తేనెతుట్టెను జగన్ కదిల్చారని అది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ కు వైఎస్ కు ఎప్పటి నుంచో అండగా ఉంటోన్న ఎస్సీ ఎస్టీలు రాబోయే ఎన్నికల్లో అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 2019లో ఎస్టీ నియోజకవర్గాలన్నిటినీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క ఎస్సీ నియోజకవర్గం మినహా ఎస్సీ రిజర్వ్ డ్ అయిన అన్ని చోటా వైసీపీ గెలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.