జాతీయ స్థాయిలో ఏపీ పోలీసుకు అవార్డుల పంట

Sun Feb 28 2021 16:00:34 GMT+0530 (IST)

Harvest of awards for AP Police at the national level

ఏపీ పోలీస్ అదరగొట్టేసింది. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ సామర్థ్యం ఏమిటన్నది మరోసారి నిరూపితమైంది. మారిన కాలానికి తగ్గట్లుగా పోలీసింగ్ సాంకేతికతను ఉపయోగించుకోవటం.. అందుకు తగ్గట్లుగా సిద్ధం కావటం ఈ మధ్యన ఎక్కువైంది. అలాంటి విషయాల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ ఉందన్న విషయం తాజాగా లభించిన అవార్డులు చెప్పేస్తున్నాయి.దేశంలోని అనేక విభాగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి డిజిటల్ టెక్నాలజీ సభ గ్రూప్ అవార్డుల్ని ప్రకటించింది. జాతీయ స్థాయిలో పన్నెండు అవార్డుల్ని ప్రకటిస్తే.. అందులో నాలుగు ఏపీ పోలీసు శాఖ సొంతం చేసుకోవటం గమనార్హం. దేశంలో మరెక్కడా లేని రీతిలో ఏపీ పోలీసులు నిర్వహిస్తున్న దిశ మొబైల్ అప్లికేషన్.. దిశ క్రైమ్సీన్ మేనేజ్ మెంట్.. సెంట్రల్ లాక్ మానిటరింగ్ సిస్టమ్.. 4ఎస్4యు యూట్యూబ్ చానల్ కు ఈ అవార్డులు దక్కాయి.

ఇటీవల దిశ క్రైమ్ సీన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ప్రధాని మోడీసైతం ప్రశంసించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లలో సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టం అమల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఈ విధానంలో ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్ లాక్ పలలో ఆడియో.. వీడియో.. నైట్ విజన్లతో కూడిన సీసీ కెమెరాల ఏర్పాటుకు ఏపీ పోలీస్ శాఖ రెండోసారి జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. సమర్థవంతమైన నాయకత్వంతోనే ఏపీ పోలీస్ ఈ ఘనతను సాధించినట్లుగా చెప్పాలి. జాతీయ స్థాయిలో సాధించిన ఈ అవార్డులకు పోలీసులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రశంసించారు.