హార్లే డేవిడ్‌సన్ మళ్లీ వచ్చేస్తోంది!

Sun Nov 22 2020 23:00:01 GMT+0530 (IST)

Harley Davidson is coming again!

హార్లే డేవిడ్‌సన్ ఈ బైక్ అంటే కుర్రాళ్లకు ఎంతో మోజు. దీని మీద తిరగడం చాలామందికి ఓ డ్రీమ్. ఈ టూవీలర్స్ అత్యంత ఖరీదైనవి కావడంతో మన రోడ్లపై కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్ బైక్‌మీద తిరగడమంటే అదో స్టేటస్ సింబల్‌గా భావించేవాళ్లు ఉన్నారు. అయితే గత సెప్టెంబర్‌లో ఈ కంపెనీ మనదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.  ఖరీదైనవి కావడంతో కేవలం ధనవంతుల పిల్లల మాత్రమే వీటిపై తిరుగుతుంటారు.అయితే ఈ కంపెనీ భారత్‌లో తన విక్రయాలను తయారీ ఆపేస్తున్నట్టు గత సెప్టెంబర్‌లో ప్రకటించింది. దీంతో  హార్లే డేవిడ్‌సన్ బైక్లవర్స్ తీవ్ర నిరాశలోకి మునిగారు. అయితే ఈ కంపెనీ జనవరి 2021 నుంచి అమ్మకాలు విడిభాగాలు సర్వీసులు సహా అన్ని సేవల్ని పునః ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కొత్త బిజినెస్ మోడల్‌ను ప్రకటించింది. హీరో మోటో కార్ఫ్తో తిరిగి తన వ్యాపారభాగస్వామాన్ని కొనసాగించనున్నది. గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల హీరో మోటోకార్ఫ్తో తెగతెంపులు చేసుకున్నది. ఇప్పుడు మళ్లీ అదే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది.

అయితే తాజా ఒప్పందం ప్రకారం.. హార్లీ డేవిడ్‌సన్ బైక్స్ విక్రయాలు సర్వీసింగ్ బాధ్యతలను హీరో మోటో కార్ప్ నిర్వహించనున్నది. ఇప్పుడు విడిభాగాలు కంపెనీ సంబంధ యాక్సెసరీస్ దుస్తులు కూడా విక్రయించనున్నది. హీరో మోటో కార్ప్‌తో ఒప్పందం ప్రకారం కొత్త మోడల్స్‌ను కూడా ఇక్కడి మార్కెట్లో విడుదల చేయనున్నారు.

డిసెంబర్ 31 2020 వరకు ఈ ఒప్పందం కొనసాగునున్నది. ఆ తర్వాత కొత్త డీలర్ నెట్వర్క్ వివరాలు తెలియపరుస్తారు.