Begin typing your search above and press return to search.

హరీశ్ రావు సమర్థతకు సరికొత్త సవాల్.. మరేం చేస్తారో చూడాలి

By:  Tupaki Desk   |   28 Nov 2021 6:39 AM GMT
హరీశ్ రావు సమర్థతకు సరికొత్త సవాల్.. మరేం చేస్తారో చూడాలి
X
కష్టం ఏదైనా వచ్చినా.. సమస్య ఏదైనా ఎదురైనా.. ఏదైనా క్లిష్టమైన టాస్కు అప్పజెప్పాలంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గుర్తుకు వచ్చేది మాత్రం మంత్రి కమ్ మేనల్లుడు హరీశ్ రావే. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఆయన మనసులో మరెన్ని అగ్నిగుండాలు.. వాయు గుండాలు ఉన్నా.. మేనమామ తనకు అప్పజెప్పిన పనిని మాత్రం నూటికి నూరుపాళ్లు సక్సెస్ చేసేందుకు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే.. ఇటీవల కాలంలో ఆయనకు అప్పగించి టాస్కులు ఫెయిల్ కావటం ఎక్కువైంది. ఆ మధ్యన దుబ్బాక.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అన్నీ తానైనట్లు వ్యవహరించినప్పటికీ ఓటమి తప్పలేదు.

గా మారనుంది. ఇప్పటివరకు రాజకీయ అంశాల విషయంలో వైఫల్యం అందరూ అర్థం చేసుకోగలిగిందే. ఎందుకంటే.. కేసీఆర్ అప్పగించే ఈ టాస్కు అయినా నిప్పుల మీద నడకనే. ప్రతికూలత ఎక్కువగా ఉన్న అంశాల్లో గెలుపు కంటే ఓటమి అవకాశాలే ఎక్కువ. ఇవేమీ ఆయన వ్యక్తిగత సమర్థతకు నిదర్శనంగా ఎవరూ భావించరు.

ఆ మాటకు వస్తే.. హరీశ్ విషయంలో చాలామందికి సానుభూతి ఉంది. సులువుగా పూర్తి అయ్యే టాస్కులు.. గెలుపునకు ఢోకా లేని వాటిని మంత్రి కేటీఆర్ కు అప్పజెబుతారన్న పేరుంది. అందుకు భిన్నంగా కష్టసాధ్యమైనవి మాత్రం హరీశ్ కు అప్పజెప్పి.. ఆయన బద్నాం అయ్యేలా చేస్తుంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీంతో.. ఆయన చేపట్టిన టాస్కుల ఫలితం ప్రతికూలంగా ఉన్నా.. ఆయన ఇమేజ్ మాత్రం డ్యామేజ్ కాలేదు. కానీ.. తొలిసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడనుంది.

కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్ భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా మొదలయ్యాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ కూడా మొదలైంది. ఇలాంటివేళ.. ఇవాళ కాకుంటే రేపు.. కాదంటే మరో పది రోజుల తర్వాత అయినా ఒమ్రికాన్ వేరియంట్ తో ఎదురయ్యే తిప్పలు తెలంగాణకు తప్పవు. ఇలాంటివేళ.. కొత్త వేరియంట్ ను సమర్థంగా ఎదుర్కోవటానికి.. సమాయుత్తం కావాల్సి ఉంది.

కరోనా మొదటి.. రెండో వేవ్ లలో తెలంగాణ ఆరోగ్య మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ ను వంక పెట్టినోళ్లు లేరు. ఆయన పని తీరుతో ప్రస్తుతఆరోగ్య మంత్రిగా ఉన్న హరీశ్ పని తీరును పోల్చటం మొదలు పెడతారు. ఎప్పుడూ ఎవరి పోలికతో అవసరం లేనట్లుగా ఉండే హరీశ్ కు తాజా పరిణామం మాత్రం పెద్ద పరీక్షగా చెప్పాలి. ఈ టెస్టులో ఫెయిల్ అయితే మాత్రం.. ఆయన సమర్థత మీద కొత్త సందేహాలు కలగటం ఖాయమని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.