Begin typing your search above and press return to search.

వివాహిత పై వేధింపులు .. నిందితుడికి కోర్టు సంచలన ఆదేశం

By:  Tupaki Desk   |   3 Aug 2020 8:10 AM GMT
వివాహిత పై వేధింపులు .. నిందితుడికి కోర్టు సంచలన ఆదేశం
X
నేడు దేశవ్యాప్తంగా రక్షబంధన్ ను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్ కోర్టు దేశం మెచ్చే తీర్పును వెల్లడించింది. రక్షాబంధన్ సందర్భంగా బాధిత వివాహితతో రాఖీ కట్టించుకొని 11 వేలు ఇవ్వాలని నిందితుడికి కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో ఉజ్జ‌యిని న‌గ‌రానికి చెందిన విక్ర‌మ్ బాగ్రి , 30 ఏళ్ల వివాహిత‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. అతడి వేధింపులు తట్టుకోలేక, ఆమె పోలీసులకి అతని పై ఫిర్యాదు చేసింది. ఆ తరువాత , ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఆకతాయిని పట్టుకొని జైలుకి తరలించారు. దీనితో ఆ నిందితుడు బెయిల్ కోసం ఇండోర్ కోర్టును ఆశ్ర‌యించాడు. నిందితుడైన బాగ్రికి రూ.50వేల వ్యక్తిగత పూచికత్తుపై ఇండోర్ కోర్టు జస్టిస్ రోహిత్ ఆర్య షరతులతో కూడిన యిలు ఇస్తూ రక్షాబంధన్ సందర్భంగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.

నేడు రక్షాబంధన్ సందర్భంగా ఉదయం నిందితుడు తన భార్యతో కలిసి బాధిత వివాహిత ఇంటికి స్వీట్ బాక్సుతో వెళ్లి, ఆమెతో రాఖీ కట్టించుకొని భవిష్యత్తులో ఆమెకు తోడుగా ఉంటానని నమ్మకం కలిగించాలని, అలాగే రూ.11వేలు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. దీనితో పాటు బాధితురాలి కుమారుడికి రూ.5వేలతో బట్టలు, స్వీట్లు కొని ఇచ్చి, బాధిత వివాహిత ఆశీర్వాదం పొందాలని నిందితుడు బాగ్రికి జడ్జి ఆదేశించారు. రక్షబంధన్ రోజు దేశం మెచ్చే తీర్పు ఇవ్వడం తో ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.