Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసా ప్రక్రియలో కీలక సవరణ.. మనకు తీవ్ర నష్టం

By:  Tupaki Desk   |   14 Jan 2021 7:56 AM GMT
హెచ్1బీ వీసా ప్రక్రియలో కీలక సవరణ.. మనకు తీవ్ర నష్టం
X
అమెరికాలో అధ్యక్షుడు మారుతున్నా.. భారతీయుల కష్టాల మాత్రం తీరేలా కనిపించడం లేదు. భారతీయులతోపాటు.. విదేశీ నిపుణులకు కూడా అమెరికాలో పనిచేయడానికి ఇబ్బందులు ఎదురయ్యేలా ఉంది. అమెరికాలో పనిచేయాలంటే హెచ్1బీ వీసా అవసరం. కొంతకాలంగా ఈ వీసాపై కఠిన ఆంక్షలు పెడుతూ విదేశీయులకు తలుపులు మూసేసాడు అధ్యక్షుడు ట్రంప్.

ప్రస్తుతం లాటరీ విధానం కాకుండా, .. మంచి వృత్తినిపుణులు.. అభ్యర్థుల ఎంపికలో వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తామని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే హోంల్యాండ్ సెక్యురిటీ తుది ప్రకటన చేసింది. ఏడాదికి సరిపడా జారీ చేసే... 85 వేల.. హెచ్‌-1బీ వీసాలను.. వేతనాలు, నైపుణ్యాల ఆధారంగా ఇవ్వనున్నారు.

కొత్త విధానం వల్ల భారతీయులకు, విదేశీయులకు తీవ్ర నష్టంగా మారనుంది. అందరికీ లాభదాయకమేనని అమెరికా చెబుతున్నా.. విదేశీ విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతిభ గల విద్యార్థులు హెచ్‌-1బీ వీసా పొజిషన్స్‌లో లెవల్‌-1కు అర్హులవుతారు. వీరంతా శిక్షణా కాలంలో ఉంటారని, వారిని అత్యధిక వేతనం పొందుతున్న వారిగా పరిగణిస్తామని యూఎస్‌సీఐఎస్‌ చెబుతోంది. అయితే, కేవలం స్టెమ్ విద్యార్థులు మాత్రమే మూడేళ్ల ఆప్ట్‌ కాలానికి అర్హత సాధించే అవకాశం ఉంది. ఏడాది ఆప్షన్ కాలానికి అర్హత సాధించే విదేశీ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని కోల్పోతారు.

అమెరికాలో చదువుకునాలనుకునే వారిపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. పట్టభద్రులైన తర్వాత కొంతకాలం అమెరికాలో పనిచేయాలనుకునే వారికి అవకాశాలు తగ్గుతాయి. తాజా నిబంధనల ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులకు మొదటగా యూఎస్‌సీఐఎస్‌ వీసాలు మంజూరు చేస్తుంది. అదే సమయంలో వారి స్థాయిని బట్టి, అత్యధిక నైపుణ్యం ఉన్న వారినీ పరిగణనలోకి తీసుకుంటుంది.ఈ కఠిన నిబంధనలు ఈ ఏడాది మార్చి 9వరకు అమల్లో ఉండడంతో అమెరికాలో వెళ్లే వారి ఆశలకు ఇది శరాఘాతంగా మారింది.