హిమాచల్ గెలుపు అంత ఈజీకాదు.. బీజేపీకి చుక్కలే.. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఇదే

Mon Dec 05 2022 22:08:10 GMT+0530 (India Standard Time)

Gujarat exit poll result

తాజాగా జరిగిన రెండు కీలక రాష్ట్రాలు. అందునా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి అసలు ఫలితం.. ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం వెలువరించనుంది. అయితే.. కొసరు ఫలితం అంటే ఎగ్జిట్ పోల్ రిజల్ట్ మాత్రం తాజాగా వచ్చేసింది. దీని ప్రకారం గుజరాత్‌లో బీజేపీ మరోసారి విజయందిశగా దూసుకు పోయే అవకాశం ఉందని తెలియగా.. హిమాచల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదని ఎగ్జిట్ ఫలితాలు తేల్చి చెప్పాయి.ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. ఇటీవల ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజాగా గుజరాత్ రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఇక్కడి ఫలితంపైనా ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చేసింది. దీని ప్రకారం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడక కాదనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితం ఎలా ఉందో చూద్దాం.

పీపుల్స్‌పల్స్ సర్వే
మొత్తం 68 స్థానాలకు బీజేపీ 27 నుంచి 37 కాంగ్రెస్ 29 నుంచి 39 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆప్ 5-9 స్తానాల్లో గెలుపు.

ఔట్‌ఆఫ్‌ద బాక్స్
భారతీయ జనతా పార్టీ 37నుంచి 40 చోట్ల విజయం దక్కించుకునే ఛాన్స్. కాంగ్రెస్ 22 నుంచి 28 చోట్ల ఆప్ 5 నుంచి 7చోట్ల గెలిచే అవకాశం ఉంది.

ఆత్మసాక్షి

బీజేపీ 31 నుంచి 35 కాంగ్రెస్ 33 నుంచి 35  ఆప్ 2 నుంచి 3 సీట్లలో గెలిచే అవకాశం ఉంది.

రిపబ్లిక్‌టీవీ-పీ మార్క్యూ సర్వే

బీజేపీ 34 నుంచి 39 చోట్ల విజయం సాధించవచ్చు. కాంగ్రెస్ 28 నుంచి 33 ఆప్ ఒకచోట గెలిచే అవకాశం ఉంది.

 టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే

బీజేపీ 38 చోట్ల కాంగ్రెస్ 28 చోట్ల గెలుపు గుర్రం ఎక్కనున్నాయని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.