Begin typing your search above and press return to search.
మీరు మనుస్మృతి చదవలేదా.. 17 ఏళ్ల కు పిల్ల ను కంటే తప్పులేదు
By: Tupaki Desk | 9 Jun 2023 9:24 PMదేశం లో ఒకవైపు.. వివాహ వయసు ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. మరో వైపు.. మనువాదం నుంచి ప్రజల ను బయట కు పడేలా.. అభ్యుదయ సంఘాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. అసలు మైనర్లయిన ఆడపిల్లలు.. గర్భం దాల్చే పరిస్థితి రావడం.. అందునా అత్యాచార బాధితురాలు కావడం.. అత్యంత దారుణమని ప్రజలు ఒక వైపు ఆందోళన చేస్తున్నారు.
మరి ఈ కేసు విషయం లో అత్యంత ఆదర్శంగా స్పందించాల్సిన హైకోర్టు మాత్రం.. "మీరు మనుస్మృతి చదవలేదా.. దాని ప్రకారం ఆడ పిల్ల 13 ఏళ్ల కే తల్లి కావొచ్చని ఉంది. ఇప్పుడు ఈ బాధితురాలి వయసు 17 ఏళ్లు.. సో తప్పులేదు" అని వ్యాఖ్యానించడం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
మైనైరై న ఓ అత్యాచార బాధితురాలి కి అబార్షన్ కు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా గుజరాత్ హై కోర్టు న్యాయమూర్తి పై విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసు లోనే వివాహం చేసుకోవడం, 17 ఏళ్లు రాకముందే పిల్లల్ని కనడం ఒకప్పుడు సహజమేన ని జస్టిస్ సమీర్ దవే వ్యాఖ్యానించారు. అత్యాచారానికి గురైన బాలిక, కడుపు లోని పిండం ఆరోగ్యం గా ఉంటే.. అబార్షన్కు తాను అనుమతించనని తేల్చి చెప్పారు.
అత్యాచార బాధితురాలి వయసు 16 ఏళ్ల 11 నెలలు. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భం తో ఉంది. గర్భం దాల్చి 24 వారాలు దాటిన నేపథ్యంలో అబార్షన్కు కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యం లోనే బాలిక తండ్రి.. గుజరాత్ హైకోర్టు ను ఆశ్రయించారు. అబార్షన్ కి అనుమతించాలని కోరారు. ఈ కేసు ను ముందస్తు విచారణ కు స్వీకరించాలని బాలిక తండ్రి తరఫు న్యాయవాది.. కోర్టు ను అభ్యర్థించారు. బాలిక వయసు తక్కువ ఉన్న నేపథ్యం లో.. ఆమె ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని న్యాయస్థానానికి విన్నవించారు.
ఈ నేపథ్యం లో స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దవే.. "21వ శతాబ్దం లో ఉన్నాం కాబట్టే.. ఈ ఆందోళనంతా. కావాలంటే మీ అమ్మను, అమ్మమ్మను అడగండి. మనువాదం ప్రకారం అప్పట్లో వివాహానికి 13, 14, 15 ఏళ్లే గరిష్ఠ వయసు. 17 ఏళ్లు రాకముందే బాలికలు.. తన తొలి బిడ్డ కు జన్మనిచ్చేవారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పెద్దవారు అవుతారు. మీరు మనుస్మృతి చదవలేదేమో. ఓసారి చదవండి." అని జస్టిస్ సమీర్ దవే అన్నారు. దీంతో కోర్టు హాల్లో ఉన్న వారంతా నిర్ఘాంత పోయారు.
వైద్యుల అంచనా ప్రకారం బాలిక డెలివరీ డేట్ ఆగస్టు 16 అని జస్టిస్ సమీర్ దవే పేర్కొన్నారు. బాలిక కు, పిండానికి ఎలాంటి సమస్య లేక పోతే అబార్షన్ ఉత్తర్వులు జారీ చేయడం కష్టమని స్పష్టం చేశారు. చివర కు.. వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి సాధ్యమవుతుందో లేదో పరీక్షించి చెప్పాలని రాజ్కోట్ సివిల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. బాలిక శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉందో అంచనా కు రావాల ని వైద్యుల కు సూచించారు.