ప్రధానమంత్రి నరేంద్రమోడీ విద్యార్హత విషయంలో ఓవరాక్షన్ చేసిన పలువురికి గట్టి స్ట్రోక్ తగిలింది. మోడీ విద్యార్హత తెలుసుకోవాలని పిటీషన్ వేసిన వారికి రూ.25వేల ఫైన్ విధించి షాకిచ్చింది కోర్టు. మోడీ ఉన్నత విద్యను అభ్యసించారనడానికి ఎలాంటి ఆధారాలను కూడా ఎవరికీ చూపాల్సిన అవసరం లేదంటూ గుజరాత్ హైకోర్టు పిటీషన్ దారులకు గట్టి బుద్ది చెప్పింది. మోడీ విద్యార్హత పత్రాలను బయటపెట్టాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం గుజరాత్ యూనివర్సిటీ సమాచార హక్కు ప్రధాన కమిషనర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాని మోదీ విద్యార్హత విషయంలో కొంతకాలంగా చర్చ జరుగుతోందన్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిపై సవాల్ విసిరారు. తన విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను బయటపెడుతానని.. అదే పని మోడీ చేయగలరా? అంటూ ఛాలెంజ్ విసిరారు. అదే సమయంలో గుజరాత్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై సమాచార హక్కు ప్రధాన కమిషనర్ కార్యాలయం గుజరాత్ యూనివర్సిటీకి లేఖ రాసింది.
ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికేట్ వివరాలను కోరిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై గుజరాత్ హైకోర్టు ₹25000 జరిమానా విధించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు విచారించింది. “ప్రజాస్వామ్యంలో పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ లేదా నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదు. అలాగే ఈ అంశంలో ప్రజాప్రయోజనాల ప్రమేయం లేదు. అతని గోప్యత కూడా దెబ్బతింటుంది” అని న్యాయపరమైన వెబ్సైట్ బార్ అండ్ బెంచ్ యూనివర్శిటీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉటంకిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 1978లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ 1983లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.
మరోవైపు కేజ్రీవాల్ తరపు న్యాయవాది పెర్సీ కవీనా వాదిస్తూ "మీరు నామినేషన్ ఫారమ్ను చూస్తే అందులో అతని విద్యార్హతలను పేర్కొంటారు. అందువల్ల మేము డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నాము. అతని మార్క్షీట్ కాదు" అని వాదించారు. అయితే కోర్టు మాత్రం మోడీ విద్యార్హత వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయనకు చెందిన డిగ్రీ పోస్ట్ గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లను బయటపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అరవింద్కేజ్రీవాల్ కు భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.25000 జరిమానా విధించి షాక్ ఇచ్చింది.