Begin typing your search above and press return to search.

నోరు తెరిచి గిన్నీస్‌ రికార్డ్‌ దక్కించుకుంది

By:  Tupaki Desk   |   29 July 2021 11:30 PM GMT
నోరు తెరిచి గిన్నీస్‌ రికార్డ్‌ దక్కించుకుంది
X
టిక్ టాక్ క్రేజ్ గురించి ప్రపంచంలో ఉన్న చాలా మందికి తెలిసే ఉంటుంది. టిక్ టాక్ వల్ల ఎంతో మంది చాలా ధనం సంపాధించారు. కొంత మంది పేరు ప్రఖ్యాతులను సరిగ్గా వాడుకోకుండా డీ ఫేమ్ అయిపోయారు. మరి కొంత మంది తమకు లభించిన స్టార్ డమ్ తో మరింత ప్రాచూర్యం పొందే పనులు చేస్తూ... చిరస్థాయిగా అభిమానుల గుండెల్లో మిగిలిపోయారు. ఎక్కువ మంది టిక్ టాక్ స్టార్లు సంపాధించే సంపాదన గురించే మాట్లాడుకునే వారు. ఎక్కువ మంది ఫాలోవర్లను ఆకర్షించగలిగితే టిక్ టాక్ లో దిమ్మ తిరిగిపోయే సంపాదన వస్తుందని చాలా మంది చెప్పుకునే వారు. అలా చాలా మంది టిక్ టాక్ తో ఉపాధిని పొందుతున్న తరుణంలో చైనా దేశంతో ఘర్షణల కారణంగా భారత ప్రభుత్వం చైనా దేశానికి చెందిన టిక్ టాక్ ను మన దేశంలో వాడకుండా నిషేధం విధించింది. దీంతో టిక్ టాక్ మీద సంపాధించే వారంతా ఒక్కసారిగా ఢీలా పడిపోయారు.

కేంద్ర ప్రభుత్వం తమ నోటి కాడి కూడు లాక్కుందని కొంత మంది ఆరోపణలు చేశారు. ఎప్పుడో భారత్ లో బ్యాన్ అయిన టిక్ టాక్ గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు అనే అనుమానం చాలా మందిలో కలిగే ఉంటుంది. కానీ ఇప్పడు టిక్ టాక్ గురించి చెబుతుంది మరలా ఇండియాలో టిక్ టాక్ రాబోతుందని కాదు. ఇలా టిక్ టాక్ ద్వారా ఫేమ్ పొందిన ఓ మహిళ ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించింది. కానీ ఈ బ్యూటీ టిక్ టాక్ తో గిన్నిస్ రికార్డును పొందలేదు. తన నోటితో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా దేశానికి చెందిన 31ఏళ్ల సమంతా రామ్స్డెల్ అనే మహిళ తనకు ఉన్న అతి పెద్ద నోరు కారణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. సమంతా నోరు అందరూ ఆశ్చర్యపోయేలా దాదాపు 6.52 సెంటీమీటర్లు ఉంటుందట. అంతే కాకుండా సమంతా దవడ కూడా ఎటంటే అటు సాగిపోవడం చసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు వచ్చి కొలతలు తీసుకుని మరీ ఆమెకు వరల్డ్ రికార్డ్స్ లో అతి పెద్ద నోరు కలిగిన మహిళగా చోటు కల్పించారు.

ఇప్పుడే కాదు చిన్నతనం నుంచే సమంతా నోరు పెద్దగా ఉండేదట. ప్రస్తుతం ఆమె చిన్న వయసులో ఉండగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా నోరు పెద్దగా ఉండడం ఆమెకు వంశపారంపర్యంగా వచ్చిందా అంటే వాళ్ల కుటుంబంలో ఎవరికీ ఆమెలా నోరు పెద్దదిగా లేదట. ఆమె నోటిలో ఓ పెద్ద యాపిల్ పండు పట్టేంతలా తెరుస్తుంది. ఇప్పటి వరకు గిన్నీస్ బుక్ లో ఎన్నో వింతలు విడ్డూరాలు నమోదు అయ్యాయి. కాని ఇది అత్యంత విచిత్రమైన వింతగా.. ఇది ఖచ్చితంగా ఒక ప్రపంచ వింతగా గిన్నీస్ బుక్ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత విభిన్నంగా ఉన్న వారు చాలా మంది ఉంటారు. వారిలో ఈమె ఒకరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.