Begin typing your search above and press return to search.

ఐసీసీ చైర్మన్ రేసులో ముందున్న సౌరవ్ గంగూలీ

By:  Tupaki Desk   |   22 May 2020 5:30 PM GMT
ఐసీసీ చైర్మన్ రేసులో ముందున్న సౌరవ్ గంగూలీ
X
బీసీసీఐ అధ్యక్షుడు.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులోకి వచ్చారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీకాలం మేనెలతో ముగియనుంది. జూన్ లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ తో సంబంధం లేని వారికి ఈసారి ఐసీసీ చైర్మన్ పీఠం ఇవ్వకూడదని క్రికెట్ సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత క్రికెట్ లో చాలా ఏళ్లు ఆడిన దిగ్గజం సౌరవ్ గంగూలీనే ఈసారి అధ్యక్షుడినే చేయాలనే డిమాండ్ మొదలైంది. ఈ క్రమంలో ఐసీసీ చైర్మన్ రేసులో గంగూలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇక ఐసీసీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు గంగూలీ కూడా ఆ దిశగా ప్లాన్లు వేస్తున్నారు. దక్షిణాఫ్రికా మద్దతు కోసం ఆదేశంతో టీ20 సిరీస్ కు ఓకే చెప్పాడు. దీంతో తాజాగా ఐసీసీ చైర్మన్ గా గంగూలీనే సరైన అభ్యర్థి అని క్రికెట్ దక్షిణాఫ్రియా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ బహిరంగంగా ప్రకటించడం విశేషం. అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడిన గంగూలీ వల్ల ప్రపంచ క్రికెట్ కు మేలు జరుగుతుందని.. ఆయన నాయకత్వ లక్షణాలు - క్రికెట్ పరిజ్ఞానం ఐసీసీ చైర్మన్ గా విజయవంతమయ్యేందుకు దోహదం చేస్తాయని స్మిత్ అన్నాడు. ఇక దక్షిణా ఫ్రికాతో పాటు సీఈవో జాక్వెస్ పాల్ కూడా గంగూలీకి మద్దతు తెలిపారు.

మహమ్మారి నేపథ్యంలో మరో రెండు నెలల పాటు ఐసీసీ చైర్మన్ పదవిని పొడిగించారు. జూలైలో ఐసీసీ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తారు. గంగూలీతోపాటు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ కూడా ఐసీసీ చైర్మన్ రేసులో ఉన్నాడు.మహమ్మారి విస్తరించిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఐసీసీ చైర్మన్ గా గంగూలీనే సమర్థవంతమైన అభ్యర్థి అని పలు దేశాలు ఆయనను బలపరిచేందుకు సిద్ధమయ్యాయి.