వైసీపీకి గ్రాడ్యుయేట్ల రిటర్న్ గిఫ్ట్.. !!

Sun Mar 19 2023 05:00:01 GMT+0530 (India Standard Time)

Graduates return gift to YCP.. !!

రాష్ట్రంలో గత నాలుగేళ్ల కాలంలో జరిగిన ఏ ఎన్నికలను తీసుకున్నా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రత్యక్షం గా మెజారిటీ దక్కించుకున్న పరిస్థితి లేదు. కార్పొరేషన్ ఎన్నికలైనా.. స్థానిక సంస్థల ఎన్నికలైనా.. రాజ్య సభ సభ్యుల ఎన్నికలైనా..వైసీపీ దూకుడు పెరిగింది. తమదే అప్రహిత విజయంగా పార్టీ నేతలు.. దూకు డు ప్రదర్శించారు. దీంతో ఇక టీడీపీ పుంజుకోవడం కష్టమేనని..అందరూ అనుకున్నారు.



ఇలాంటి సమయంలో అనూహ్యంగా గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. వీటిలో అసలు ఏమా త్రం అంచనాలు కూడా లేకుండా.. రాకుండా.. టీడీపీ తన అభ్యర్థులను నిలబెట్టడం.. తెలిసిందే.

అయితే  మూడు గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ వైసీపీ వెనుకబడి పోయి.. టీడీపీ విజయం దక్కించుకుంది. ఇది వైసీపీకి గ్రాడ్యుయేట్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.

ఇక ఉత్తరాంధ్రలో  వైసీపీ అభ్యర్థి డబ్బులు పంచుతున్నారనేప్రచారం సాగింది. అదేసమయంలో దొంగ ఓటర్లు చేర్పించారనే వాదన కూడా వినిపించింది. అయితే.. ఇన్ని చేసినా.. వైసీపీఆయా స్థానాల్లో విజయం దక్కించుకోలేక పోయింది.

ఆయా నియోజకవర్గాల్లో టీడీపీనే  గెలుపు గుర్రం ఎక్కింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా(టీడీపీ ఆరోపించినట్టు) గ్రాడ్యుయేట్ ఓటర్లు నిర్భయంగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని స్పష్టమైంది !!

"మేం ఓడిపోయాం.. ఒప్పుకొంటున్నాం. కానీ గ్రాడ్యుయేట్ల నాడిని మేం పట్టుకోలేక పోయాం. వచ్చే ఎన్నికల నాటికి మా పరిస్థితిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం" అని వైసీపీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.