Begin typing your search above and press return to search.

ఈ 9 రూల్స్ ప్రభుత్వ పాఠశాలలు పాటించాల్సిందే ...అవేంటంటే ?

By:  Tupaki Desk   |   15 Nov 2019 1:30 AM GMT
ఈ 9 రూల్స్ ప్రభుత్వ పాఠశాలలు పాటించాల్సిందే ...అవేంటంటే ?
X
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలకి దీటుగా సమాధానం ఇస్తూ ..తాను అనుకున్న పనిని చేసుకుంటూ పోతున్నాడు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పై ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి ..వారి పిల్లలు , మనవళ్లుఅందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. కానీ , పేద , మధ్యతరగతి వారి పిల్లలు మాత్రం తెలుగు మీడియం లోనే చదివి అలానే ఉండాలి. కానీ , సీఎం జగన్ మాత్రం ఎవరు ఎమన్నా కూడా వెనక్కి తగ్గేదే లేదు అంటూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి కావాల్సిన అన్ని వసతులని సమకూర్చుతున్నారు.

ఇక ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాల్లో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ .. రానున్న భవిష్యత్ కాలంలో.. ఇంగ్లీషు భాష ముఖ్యమని.. ప్రపంచంతో పోటీ పడేలా మన పిల్లల్ని చదివించాలని అన్నారు. నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని పేర్కొన్నారు. అందుకే.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు భాష ఖచ్చితంగా ఉండాలని అన్నారు. అలాగే తెలుగు సబ్జెక్టు కూడా తప్పనిసరి అంటూ చెప్పారు.

అలాగే పాత గోడలు.. పెచ్చులూడే స్లాబ్‌లు, పాడుబడ్డ బంగ్లాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంలో విద్యార్థులు ఉంటున్నారు. ఇవన్నీ కూడా నిన్నటి వరకు పాఠశాలల పరిస్థితి. ఇకపై ఇలా ఉండకూడదని, స్కూల్స్‌ రూపురేఖలు మార్చ బోతున్నట్టు తెలిపారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా.. ఏపీలో ఉన్న 45 వేల ప్రభుత్వ పాఠశాలలను మూడు భాగాలుగా విభజించి, మొదటి దశలో 15 వేల స్కూళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రతీ పాఠశాలలో ఈ 9 వసతులు ఖచ్చితంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉండాల్సిన ఆ 9 వసతులు ...

1. రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు
2. విద్యుదీకరణతో పాటు ఫ్యాన్లు, లైట్లు
3. రక్షిత తాగునీరు
4. విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నీచర్
5. మొత్తం పాఠశాలకు పెయింటింగ్‌
6. మేజర్‌, మైనర్‌ మరమ్మతులు
7. గ్రీన్ చాక్ బోర్డ్ లు
8. అదనపు తరగతి గదులు
9. ప్రహరీ గోడ నిర్మాణం