గోరంట్ల మీద పిడుగు వేసిన పట్టాభి.. వీడియో ఒరిజనలే!

Sat Aug 13 2022 20:52:15 GMT+0530 (India Standard Time)

Gorantla Madhav original video news

నిజం నిప్పులాంటిదని ఊరికే అనలేదు. కొన్ని సందర్భాల్లో తప్పులు జరిగితే.. చెంపలు వేసుకొని.. తప్పు జరిగిందంటే అక్కడితో అయిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో తప్పు ఒప్పుకోలేని సున్నిత పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉంటే సరిపోతుంది. కానీ.. వైసీపీ నేత.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారా? అంటే.. టీడీపీ నేత పట్టాభి మాటల్లో అయితే.. అవుననే చెబుతారు. తనకు సంబంధించిన బూతు వీడియో ఒకటి బయటకు రావటం.. దానిపై ఎంపీ గోరంట్ల వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చిన బండ బూతుల్ని తెగ తిట్టేసిన వైనంతో అందరూ షాక్ తిన్నారు.వీడియోను చూసినంతనే నిజమా? మార్ఫింగ్ చేసిందా? అన్నదానిమీద అందరికి కాకున్నా.. కొందరికి మాత్రం క్లారిటీ వచ్చేసే పరిస్థితి. దీనికి తోడు సాంకేతికత అందుబాటులోకి వచ్చిన వేళ.. ఏది నిజం? ఏది అబద్ధం? అన్న విషయాన్ని ఇట్టే చెప్పేసే పరిస్థితులు ఇప్పుడు చాలామంది తేల్చుకునే టెక్నాలజీ అందుబాటులో ఉంది. మరీ. కాదూ కూడదంటే.. దాని సంగతి తేల్చే ప్రైవేటు ల్యాబ్ లు ఉన్నాయి.

గోరంట్ల మాధవ్ వీడియోలు నిజమా? అబద్ధమా? అన్న విషయాన్ని తేల్చేందుకు టీడీపీ పెద్ద ప్రయత్నమే చేసింది. ఈ విషయాన్ని టీడీపీ నేత పట్టాభి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.

అమెరికాకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ సంస్థ గోరంట్ల వీడియోలు ఒరిజినలే అన్న విషయాన్ని తేల్చిందని చెప్పారు. అంతేకాదు.. సదరు సంస్థ జారీ చేసిన నివేదికను కూడా మీడియాకు విడుదల చేశారు. ‘మార్ఫింగ్.. ఎడిటింగ్ లాంటివి ఏమీ జరగలేదని నివేదికలో పేర్కొన్నారు. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి.. ఇది సరిపపోతుందా మీకు. మీ ఎంపీపై చర్య తీసుకోవటానికి ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే మాధవ్ కు ఎలా క్లీన్ చిట్ ఇస్తారు? ఆయన్ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని మండిపడ్డారు.

ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోరని తమకు తెలుసని.. అందుకే అమెరికాలోని టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎక్ లిప్స్ ఫోరెన్సిక్) లో వీడియో పరీక్ష చేయించామన్నారు. ఫోన్లో ప్లే అవుతున్న వీడియోను స్మార్ట్ ఫోన్లో రికార్డు చేసిన విషయాన్ని నివేదికలో పేర్కొన్నారన్నారు. ఈ వీడియోను మిస్టర్.

పోతిని తనను ఆగస్టు తొమ్మిదిన వీడియో విశ్వసనీయత గురించి అడిగారని.. తనకు ఈ రంగంలో తనకు అనుభవం ఉందని.. ఈ ఏడాది ఇప్పటివరకు తాను 40 వరకు వీడియోల విశ్వసనీయతను సాంకేతికంగా పరీక్ష చేసినట్లుగా ఆమెరికా ఫోరెన్సిక్ సంస్థ ఎగ్జామినర్ జిమ్ స్టాఫోర్డు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ వీడియో ఎడిటెడ్ వెర్షన్ గా పేర్కొంటున్న వేళ.. అందుకు భిన్నంగా ఈ వీడియో ఒరిజినల్ అంటూ పేర్కొన్న వైనం సంచలనంగా మారింది. మరిప్పుడు ఏపీ అధికారపక్షం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.