Begin typing your search above and press return to search.

వివాదాస్పద కంటెంట్ పై ‘గూగుల్’ కొరఢా

By:  Tupaki Desk   |   31 July 2021 2:30 AM GMT
వివాదాస్పద కంటెంట్ పై ‘గూగుల్’ కొరఢా
X
ఇంటర్నెట్ లో ఇప్పుడు హింస పెరిగిపోయింది. అలాగే సెక్సువల్,ప్రేరేపిత కంటెంట్, ట్రోలింగ్, ఇతరులను కించపరిచేలా ఫొటోలు, వీడియోలు, ఆడియోలు పెట్టడం ఎక్కువైంది. వీటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు దాఖలవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ చట్టాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.

ఇవన్నింటిపై అంతర్జాతీయ సెర్చింజన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కొరఢా ఝలిపించింది. ఇంటర్నెట్ లో సెక్సువల్ కంటెంట్ అప్ లోడ్ చేసే వారికి షాకిచ్చింది. దాంతోపాటు కాపీ పేస్ట్ రాయుళ్లు, వివాదాస్పద అంశాలు జోడించే వ్యక్తులపై గూగుల్ కొరఢా ఝలిపించింది. స్థానిక చట్టాలను గౌరవించని.. ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ ను పోస్ట్ చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పింది.

ఆటోమేషన్, వ్యక్తిగత ఫిర్యాద ఆధారంగా అభ్యంతర కంటెంట్ ను గూగుల్ పెద్దఎత్తున తొలగిస్తోంది. ఇప్పటిదాకా ఆటోమేషన్ ద్వారా అభ్యంతరకర కంటెంట్ ను గుర్తించడంతోపాటు వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా గూగుల్ చర్యలకు ఉపక్రమిస్తోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఇండియాకు సంబంధించి ఏకంగా 13.78 లక్షల కంటెంట్ ను గూగుల్ తొలగించి కొరఢా ఝలిపించింది.

గూగుల్ వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా 2,17,095 లింక్ లను తొలగించగా.. ఇంతకు పదింతల అభ్యంతరక సమాచారాన్ని గూగుల్ డిలీట్ చేసింది. ఆటోమేషన్ లోనే 11 లక్షల కంటెంట్ ను తొలగించింది.

ఇందులో ఎక్కువ భాగం చిన్నారులను లైంగికంగా వేధించడం.. జుగుప్సకరమైన హింసకు సంబంధించిన కంటెంట్ ఉన్నట్టు గూగుల్ తెలిపింది. భారత ప్రభుత్వ ఐటీ చట్టాలకు నుగుణంగా గూగుల్ ఇలా నెలనెలా అభ్యంతర కంటెంట్ పై కొరఢా ఝలిపిస్తూ కఠినంగా వ్యవహిస్తూ తొలగిస్తోంది.