Begin typing your search above and press return to search.

బంగారం, వెండి ధరలు పరుగో పరుగు..గరిష్ఠ స్థాయికి చేరి రికార్డులు బ్రేక్ చేసి..

By:  Tupaki Desk   |   5 Aug 2020 10:50 AM GMT
బంగారం, వెండి ధరలు పరుగో పరుగు..గరిష్ఠ స్థాయికి చేరి రికార్డులు బ్రేక్ చేసి..
X
బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి బంగారం, వెండి ధరల జోరు మాములుగా లేదు. ధరల పరంగా రోజుకొక రికార్డు నమోదు చేస్తున్నాయి. వెండి ధరలు ఏకంగా 2013 గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి. ఔన్స్ 26 డాలర్లను అందుకుంది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ సహాయక ప్యాకేజీలు కూడా బంగారం, వెండి ధరలు పెరిగేందుకు దోహద పడుతున్నాయి.

బులియన్ చరిత్రలోనే ఫ్యూచర్, స్పాట్ మార్కెట్లలో తొలిసారి బంగారం ధరలు 2, 000 డాలర్లకు ఎగువన ముగిశాయి. ఫ్యూచర్స్ లో ఔన్స్(31.1) గ్రాములు ) సుమారు 35 డాలర్లు అందుకుని 2021 డాలర్ల వద్ద ముగిసింది. న్యూయార్క్ కామెక్స్ లో బంగారం 0.6 శాతం బలపడి 2032 డాలర్లకు ఎగువన ఉండగా, స్పాట్ మార్కెట్లో మాత్రం కాస్త తగ్గి 2014 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి కూడా 0.3 శాతంతో అతి తక్కువగా 26 డాలర్ల సమీపంలో ట్రేడింగ్ లో ఉంది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం 834 లాభపడి రూ. 54, 551 వద్ద నిలవగా, ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి రికార్డు స్థాయిలో కేజీ ధర రూ. 4049కి చేరుకుని రూ. 69797 వద్ద ముగిసింది.

బంగారానికి కీలకమైన 2000 డాలర్ల రెసి స్టెన్సీని సులువుగా అధిగమించడంతో వచ్చే ఏడాదిన్నర కాలంలో ఔన్స్ బంగారం 2500 డాలర్లను తాకే అవకాశాలు ఉన్నట్లు యూఎస్ కి చెందిన బులియన్ సాంకేతిక విశ్లేషకుడు విడ్మెర్, ఫ్రాన్సి స్కో అభిప్రాయం వ్యక్తం చేశాడు.