Begin typing your search above and press return to search.
నల్ల బంగారం : అక్కడ పోటెత్తిన రెండు వేల నోటు
By: Tupaki Desk | 26 May 2023 1:44 AM ISTనల్ల ధనం దొంగ డబ్బు అంతా ఇపుడు బంగారం షాపులలో వెల్లువెత్తుతోంది. పెద్ద నోటు అక్కడ పోటెత్తుతోంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధలన మేరకు పెద్ద నోటు ఉపసంహరించుకుంటున్నారు. సెప్టెంబర్ 30 వరకూ రెండు వేల నోట్లు మార్చువచ్చు అని రిజర్వ్ బ్యాంక్ వెసులుబాటు కల్పించింది.
ఆ మేరకు బ్యాంకుల వద్ద తగిన ఏర్పాట్లు చేసింది. ఈ నెల 23 నుంచి బ్యాంకుల వద్ద నోట్లను మార్చుకునేందుకు సకల సదుపాయాలు కల్పించింది. ఇల పెద్ద నోట్లు అన్నీ బ్యాంకుల వద్దకు చేరి అక్కడ భారీ క్యూలు కనిపిస్తాయని బ్యాంకుల వద్ద 2016 నాటి సన్నివేశాలు కనిపిస్తాయని అంతా భావించారు.
కానీ నల్ల కుబేరులు కొత్త రూట్ కనిపెట్టారు. రెండు వేల నోట్లు నేరుగా బ్యాంకులకు రావడం లేదు. బంగారం వైపుగా మళ్ళుతోంది. దాంతో ముంబై జ్యూయల్ బజార్ నుంచి దేశమంతా ఉన్న మహా నగరాలలో బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. రెండు వేల నోట్లను గుట్టలుగా తెచ్చి బంగారం కొనేస్తున్నారు.
ఈ పరిణామంతో బంగారు బిస్క్టట్లకు డిమాండ్ పెరిగింది. ఏకంగా పాతిక శాతం అమ్మకాలు పెరిగాయని అంటున్నారు. ఆ తరువాత చూస్తే ఆభరణాలు నగలకు మరో పదిహేను శాతం ఇటీవల కాలంలో అమ్మకాలు పెరిగాయని అంటున్నారు.
ఇక బంగారం ధరలు కూడా తాజా పరిణామాలతో పెరుగుతున్నాయని చెప్పాలి. బంగారాన్ని కొనుగోలు చేయడానికి కారణం పెద్దగా ఇబ్బందులు ఉండవని అంటున్నారు. బ్యాంకులకు వెళ్తే యాభై వేల తరువాత డిపాజిట్ చేస్తే పాన్ కార్డు చూపించాలి. అలాగే ఎక్కువ మొత్తంలో నోట్లు మార్చితే ఐటీ వెంట పడుతుందన్న కంగారు ఉంది.
దాంతో ఇపుడు అందరి ఫోకస్ బంగారం మీదకు మళ్ళింది అని అంటున్నారు. అయితే రెండు లక్షల దాకా బంగారం కొనుగోలు చేయడానికి ఏ రకమైన ఇబ్బందులు లేవు. అలా కొనుగోలు విరివిగా రెండు వేల రూపాయలతో చేస్తున్నారు. అదే విధంగా తమ ఇంట్లో ఉన్న పని మనుషులతో, డ్రైవర్లతో ఇతరత్రా తెలిసిన వారితో కూడా డబ్బులు చేతికి ఇచ్చి బంగారం కొనిపిస్తున్నారని అంటున్నారు
దీంతో బంగారం కాస్తా నల్ల బంగారంగా మారుతోంది అని అంటున్నారు. అయితే ఐటీ బంగారం కొనుగోళ్ల మీద ఫోకస్ పెట్టదా అంటే అంతలా కన్ను పడకపోవచ్చు అన్న ధైర్యమే ఈ విధంగా బంగారం వైపు చూస్తున్నారు అని అంటున్నారు. బంగారం కొని ఎంత పోగేసుకున్నా దాని విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు, దాంతో ఇపుడు బంగారం మీద అందరి కన్ను పడింది అని అంటున్నారు.
ఈ మార్చి నెల వరకూ చూస్తే బంగారం మీద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య తగ్గింది. బంగారం ధర విపరీతంగా పెరగడం, మరో వైపు ఆర్ధిక పరిస్థితి కూడా దేశంలోని ప్రజలు ఆ వైపు చూడడంలేదు. అయితే రెండు వేల నోట్ల రద్దు తరువాత బంగారం వైపుగా వెళ్ళడంతో అమ్మకాలు పెరుగుతాయని అంటున్నారు. అలా బంగారం డిమాండ్ అన్నది పెరుగుతోంది అంటున్నారు. బ్యాంకులు వెలవెల, బంగారం దుకాణాలు కళకళలాడుతున్న నేపధ్యంలో ఐటీ వంటి వ్యవస్థలు ఆ వైపుగా చూస్తాయా అన్నదే ఇపుడు ఆస్కతికరమైన అంశం.