బెంగళూరులో దారుణం.. కదిలే కారులో యువతిపై గ్యాంగ్ రేప్

Fri Mar 31 2023 17:01:51 GMT+0530 (India Standard Time)

Girl Raped in Moving Car in Banglore

దేశంలో నిర్భయ దిశ లాంటి చట్టాలు వచ్చినా కూడా మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు అస్సలు తగ్గడం లేదు. ఇంకా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బెంగళూరు వంటి ఐటీ సిటీలోనూ పట్టపగలు మిట్టమధ్యాహ్నం అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. కామంధులు బరితెగించి మహిళలపై అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు.తాజాగా బెంగళూరులో దారుణం జరిగింది. మహిళను బలవంతంగా తీసుకెళ్లి కదిలే కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులో ఓ మహిళ పార్కులో ఉండగా అక్కడ నుంచి ఈడ్చుకెళ్లి కదులుతున్న కారులో నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గత వారం మార్చి 25న కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో బాధిత  బాధిత మహిళ తన స్నేహితుడిని కలుసుకునేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

వారిద్దరూ అర్ధరాత్రి వరకూ పార్కులోనే ఉండడంతో నిందితుల్లో ఒకరు బాధితులను ప్రశ్నించాడు. అయితే సదురు మహిళ స్నేహితుడు వెళ్లిపోగానే నిందితుడు తన మరో ముగ్గురు స్నేహితులను పిలిచి పార్క్ నుంచి మహిళను తీసుకెళ్లి తమ కారులోకి బలవంతంగా ఎక్కించారు.

నలుగురు నిందితులు కారులోనే వేగంగా వెళుతూ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని ఆమె ఇంటి వద్ద దించేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో మహిళ బెదిరిపోయింది. చివరకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్యాంప్ జరగిన తర్వాత నేరుగా ఆస్పత్రికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు సీనియర్ పోలీస్ అధికారి సీకే బాబా తెలిపారు.         


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.