Begin typing your search above and press return to search.

భారత్ నుంచి ఖరీదైన బహుమతులు.. లెక్క చెప్పని ట్రంప్

By:  Tupaki Desk   |   21 March 2023 5:54 PM GMT
భారత్ నుంచి ఖరీదైన బహుమతులు.. లెక్క చెప్పని ట్రంప్
X
అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంపు ముద్రపడ్డాడు. ఆయన చర్యలు, తీసుకున్న చర్యలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆఖరుకు వివిధ దేశాల నుంచి వచ్చిన బహుమతుల విషయంలోనూ డొనాల్డ్ ట్రంప్ లెక్క చెప్పలేదన్న విషయం తాజాగా బయటపడింది.

ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా భారత్ సహా వివిధ విదేశీ నేతల నుంచి భారీగా గిఫ్ట్ లు అందుకున్నాడు. ఆ బహుమతుల విలువ సుమారు రెండున్నర లక్షల డాలర్లు ఉంటుందని డెమొక్రటిక్ కాంగ్రెస్ కమిటీ తాజాగా అంచనావేసింది. ట్రంప్ తోపాటు ఆయన సతీమణికి కూడా ఆ కానుకలు అందాయి.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా భారత నాయకులు $47,000 విలువైన బహుమతులు ట్రంప్ కు ఇచ్చారు. ఇవే కాకుండా విదేశీ నాయకులు ట్రంప్ కుటుంబానికి అందించిన $250,000 విలువైన బహుమతులను వెల్లడించడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని కమిటీ తన రిపోర్టులో ఆరోపించింది.

డెమొక్రటిక్ ప్రజాస్వామ్య కాంగ్రెస్ కమిటీ నివేదికలో ఈ మేరకు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. "సౌదీ కత్తులు, భారతీయ ఆభరణాలు సాల్వడార్ ట్రంప్ పొట్రైట్ అన్న టైటిల్ తో ఈ రిపోర్టును రిలీజ్ చేశారు.

ఫారిన్ గిఫ్ట్స్ అండ్ డెరేషన్ యాక్ట్ ప్రకారం.. ట్రంప్ పై చర్యలు చేపట్టారు. ఈ మిస్సైన ఆ భారీ గిఫ్ట్ లు ఎక్కడ ఉన్నాయన్న కోణంలో కమిటీ దర్యాప్తు చేస్తోంది. అమెరికా విదేశాంగ విధానరంలో భాగంగా వివిధ దేశాధినేతలు ట్రంప్ కు గిఫ్ట్ లు ఇచ్చారా? లేదా? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు కాంగ్రెస్ నేత జేమీ రాస్కిన్ తెలిపారు.

రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా పనిచేశారు.ఈ హయాంలోనే ట్రంప్ ఫ్యామిలీ సుమారు వందకుపైగా విదేశీ గిఫ్ట్ లు అందుకుంది. వాటి విలువ భారీగా ఉంది. భారత్ నుంచే అందిన గిఫ్ట్ ల విలువ 47వేల డాలర్లు. యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన 8500 డాలర్ల విలువైన ప్లవర్ వాస్ తోపాటు 4600 డాలర్ల విలువైన తాజ్ మహల్ ప్రతిమ, రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన 6600 డాలర్ల విలువైన రగ్గు ఉన్నాయి. మోడీ కూడా 1900 డాలర్ల విలువైన కఫ్ లింక్ ను బహుమతిగా ఇచ్చారు. ట్రంప్, ఆయన కుటుంబం మొత్తం పావు మిలియన్ డాలర్ల విలువైన 100 కంటే ఎక్కువ విదేశీ బహుమతులను నివేదించడంలో విఫలమయ్యారని నివేదిక ఆరోపించింది. వీటిపై చర్యల దిశగా అడుగులు వేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.