Begin typing your search above and press return to search.

కెప్టెన్సీపై కోల్ కతా నిర్ణయం కరెక్ట్ కాదు..మాజీ కెప్టెన్ సెటైర్

By:  Tupaki Desk   |   17 Oct 2020 1:10 PM GMT
కెప్టెన్సీపై కోల్ కతా  నిర్ణయం కరెక్ట్ కాదు..మాజీ కెప్టెన్  సెటైర్
X
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గా ఉన్న దినేష్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ పై మరింత దృష్టి పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, నా నిర్ణయం జట్టు కూడా మేలు చేసేదేనని దినేష్ కార్తీక్ ప్రకటించాడు. దినేష్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగానే జట్టు యాజమాన్యం నూతన నూతన కెప్టెన్ గా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నియమించింది. అయితే ఐపీఎల్ లో ఇప్పటికే సగం మ్యాచులు పూర్తయిన సమయంలో కెప్టెన్సీ మార్పుపై పలువురు మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు కోల్ కతా యాజమాన్యంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే అపజయాల్లో ఉన్న జట్టుకు సీజన్ మధ్యలో కొత్త కెప్టెన్ ను నియమించడం వల్ల జట్టుకు మరింత నష్టం చేకూరుస్తుందని అంటున్నారు.

దినేష్ కార్తీకే స్వయంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని మేనేజ్ మెంట్ చెబుతున్నా.. ఒత్తిడి పెంచి బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశారని కోల్ కతా అభిమానులు, విశ్లేషకులు విమర్శిస్తున్నారు. దీనిపై కోల్ కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్, రెండు సార్లు టైటిల్ అందించిన గంభీర్ మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సీజన్ మధ్యలో జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదన్నాడు. మోర్గాన్ కెప్టెన్సీ తీసుకున్నా ఇప్పటికిప్పుడు జట్టును మార్చడం అయ్యేపని కాదు. ఒకవేళ టోర్నీ ప్రారంభ సమయంలోనే బాధ్యతలు అప్పజెప్పి ఉంటే మార్పు తీసుకురావచ్చేమో ఏమోగానీ ఇప్పటికి ఇప్పుడు మాత్రం అయ్యేపని కాదన్నాడు.టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయం సరైనది కాదంటూ గంభీర్ పరోక్షంగా ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశాడు. 'వారసత్వాన్ని నిర్మించడానికి కొన్నేళ్లు పడుతుంది. కానీ నాశనం చేయడానికి ఒక నిమిషం చాలు'అని ట్వీట్ చేశాడు.