Begin typing your search above and press return to search.

గంటాను విశాఖ జిల్లా నుంచే దాటించేస్తున్నారా...?

By:  Tupaki Desk   |   9 Jun 2023 7:32 PM GMT
గంటాను విశాఖ జిల్లా నుంచే దాటించేస్తున్నారా...?
X
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన వ్యూహరచనా చతురుడు. అంతే కాదు అంగబలం అర్ధబలం దండీ గా ఉన్నా వారు. పార్టీ కి ఆయన అసెట్. తన గెలుపు కోసం తానుగా సొంతంగా వ్యూగాలు రచించుకుని పోల్ మేనేజ్మెంట్ నుంచి అన్నీ జాగ్రత్తగా చూసుకుని గెలవడం ఆయన సొంతం.

అందుకే గంటా కు నియోజకవర్గ లతో సంబంధం లేదు, పార్టీ లతో అంతకంటే సంబంధం లేదు. ఆయన నామినేషన్ వేశారా గెలిచేసినట్లే. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ని తట్టుకుని మరీ విశాఖ ఉత్తర నియోజకవర్గం లో తొలిసారి టీడీపీ కి గెలుపు రుచి చూపించిన మొనగాడి గా గంటా ను పేర్కొంటారు.

అటువంటి గంటా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఒక సారి ఎంపీ గా పనిచేసి పాతి కేళ్ళ నుంచి విశాఖ జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన ఏడేళ్ళ పాటు అప్రతిహతంగా మంత్రి గా పనిచేసి వివిధ మంత్రిత్వ శాఖల ను చూశారు. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాల ని తపిస్తున్న గంటాను ఏకంగా విశాఖ జిల్లా నుంచే పంపిం చేసే రాజకీయం సాగుతోందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

విశాఖ జిల్లా టీడీపీ రాజకీయా లలో గంటా కు మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కి మధ్య పడదన్నది బహిరంగ రహస్యం. పార్టీ అధికారం లో ఉన్నా లేక విపక్షం లో ఉన్నా కూడా ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైషమ్యాలు అలాగే కొనసాగుతున్నాయి. నిజానికి 2019 ఎన్నికల్లో పార్టీ విశాఖ జిల్లా లో భారీ ఓటమి చెందడాని కి ఇద్దరు నాయకుల వైరం కూడా ఒక కారణం అని పార్టీ పెద్దలు భావిస్తూంటారు.

ఇదిలా ఉటే గంటా నాలుగేళ్ళ తరువాత మళ్లీ టీడీపీ లో యాక్టివ్ అవుతున్నారు. ఆయన తన నియోజకవర్గం విశాఖ ఉత్తరం లో పార్టీ క్యాడర్ తో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే విధం గా వైసీపీ ప్రభుత్వం మీద జగన్ మీద ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. విశాఖ జిల్లా వరకూ గంటా వర్గం స్ట్రాంగ్ గానే ఉంది. దాంతో ఆయన టీడీపీ లో మళ్లీ రీ యాక్టివ్ కావడం తో అయ్యన్న వర్గం గుర్రు గా ఉంది.

ఇంకో వైపు టీడీపీ అధినాయకత్వం కూడా గంటా రీ యాక్టివ్ అవుతున్నా మునుపటి ప్రాధాన్యత ఇస్తుందా అన్నది చర్చగా ఉంది చంద్రబాబు ఇటీవల కాలంలో అనేక సార్లు విశాఖ టూర్ కి వచ్చారు ఆ సందర్భంగా గంటా ఆయన్ని కలసి వస్తున్నారు కానీ చంద్రబాబు మాత్రం గంటా తో మునుపటి సాన్నిహిత్యం నెరపడం లేదని ప్రచారంలో ఉన్న మాట.

ఈ నేపధ్యంలో గంటా అయ్యన్న వర్గాల మధ్య పోరు తో మళ్ళీ టీడీపీ కి ఇబ్బందులు వస్తాయని అధినాయకత్వంలో కలవరం రేగుతోంది అని అంటున్నారు. ఈ పరిణామాల క్రమం లో గంటా ను విశాఖ జిల్లా నుంచి కాకుండా వేరే జిల్లా కు షిఫ్ట్ చేస్తున్నారు అన్న టాక్ అయితే నడుస్తోంది. గంటా సొంత జిల్లా ఒంగోలు. అక్కడ నుంచి ఆయన్ని ఎంపీ గా పోటీ చేయించాల ని అధినాయకత్వం ఆలోచిస్తోంది అన్న వార్తలు ఇపుడు విశాఖ టీడీపీ లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాయి.

విశాఖ తో మూడున్నర దశాబ్దాల అనుబంధం పెంచుకుని ఇక్కడే రాజకీయంగా ఎదిగిన గంటాను ఈ జిల్లా నుంచి దూరం చేయాలనుకోవడం వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ కూడా వస్తోంది. గంటా కు విశాఖ నుంచి ఈసారి కోరుకున్న టికెట్ దక్కే చాన్స్ లేదు అంటున్నారు. బీజేపీ తో పొత్తు ఉంటే కనుక విశాఖ ఉత్తరం సీటు ఆ పార్టీకి పోతుంది అని అంటున్నారు. అలా కాకపోయినా ఈ సీటు ని జనసేన కూడా కోరుతుందని అంటున్నారు. సో గంటా కు సిట్టింగ్ సీటు డౌట్ లో ఉంది అంటున్నారు.

ఆయన మరోసారి భీమిలీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ భీమిలీ కూడా జనసేన కు పోతుంది అని అంటున్నరు కాపులు ఎక్కువగా ఉండే చోటనే గంటా ప్రతీ సారీ పోటీ చేసి గెలుస్తున్నారు. ఇపుడు ఆ సీట్లను జనసేన టార్గెట్ చేయడంతో గంటా కు సీటు ఎక్కడ అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే విశాఖ ఎంపీ సీటు కానీ అనకాపల్లి ఎంపీ కానీ గంటా కు ఇస్తారని ప్రచారం జరిగింది. ఇపుడు అది కాస్తా ఒంగోలు ఎంపీ సీటు అని ప్రచారం సాగుతోంది.

మొత్తానికి గంటాని విశాఖ జిల్లా రాజకీయాల నుంచి దూరం చేయడానికే ఇదంతా చేస్తున్నారా అన్న డౌట్లు ఆయన అనుచరు లలో కలుగుతున్నాయట. గంటా ను ఒంగోలు కు షిఫ్ట్ చేస్తే అక్కడ వైసీపీ కి బలమున్న చోట గంటా వంటి వారు ఎంపీ సీటుని ఈజీ గా గెలుచుకుని వస్తారని, అదే విధంగా ఆయన్ని ఢిల్లీ రాజకీయాల కు పరిమితం చేయవచ్చు అన్న ఆలోచన కూడా ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా లో కూడా వర్గ పోరు లేకుండా చేసుకోవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఇది అధినాయకత్వానికి కలిగిన ఆలోచనా లేక ఎవరైనా సూచించారా అన్నదే ఆలోచించాలని అంటున్నారు. మరి విశాఖ ను వదిలేసి ఒంగోలు నుంచి రాజకీయం చేయడానికి గంటా ఇష్టపడతారా అన్నదే కీలక మైన పాయింట్. గంటా విశాఖ ను వదిలి రాకపోవచ్చు అంటున్నరు. అంతటి పరిస్థితి వస్తే ఆయన వేరే విధంగా కఠిన నిర్ణయం తీసుకుంటారు అని కూడా ప్రచారంలో ఉంది.