Begin typing your search above and press return to search.

కెనడాలో పెళ్లికి వెళ్లిన భారత్ గ్యాంగస్టర్ ను ప్రత్యర్థులు లేపేశారు

By:  Tupaki Desk   |   30 May 2023 8:00 PM GMT
కెనడాలో పెళ్లికి వెళ్లిన భారత్ గ్యాంగస్టర్ ను ప్రత్యర్థులు లేపేశారు
X
ఇప్పుడు చెప్పింది తెలిసినంతనే రియల్ కాదు రీల్ అనుకోవచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పే షాకింగ్ క్రైం ఉదంతం రియల్ గా జరిగింది. భారత సంతతికి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు కెనడాలో జరిగే పెళ్లికి వెళ్లటం.. అక్కడ అతడి మీద అటాక్ జరగటం. అక్కడికక్కడే సదరు గ్యాంగ్ స్టర్ ప్రాణాలు విడవటం లాంటి సీన్లుచోటు చేసుకున్నాయి. సినిమాటిక్ గా సాగిన ఈ ఉదంతంలోకి వెళితే.. విస్మయానికి గురి కాక మానదు.

వాంకోవర్ సిటీలో ఒక పెళ్లి జరిగింది. దీనికి మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్ స్టర్ గా పేరున్న అమర్ ప్రీతి సామ్రా హాజరయ్యారు. అతడి మీద చాలానే కేసులు ఉన్నాయి. అయితే.. అతడు పెళ్లికి వచ్చిన విషయం అతడి ప్రత్యర్థులకు సమాచారం అందేలా చేసింది. దీంతో.. అతడి మీద అతడి ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా దాడి చేసి కాల్పులు జరిపారు.

అక్కడి వారు వెంటనే స్పందించి.. పోలీసులు.. పారా మిలటరీ దళాలకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు.. బాధితుడికి సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

కాల్పులు జరిపినప్రాంతానికి అంబులెన్సు వచ్చే నాటికి సదరు గ్యాంగ్ స్టర్ ప్రాణాలు పోయాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భారత అధికారుల మోస్ట్ వాంటెండ్ జాబితాలోనే అమర్ ప్రీత్ సామ్రా పేరు ఉండటం గమనార్హం. అంతేకాదు అతడి సోదరుడు రవీందర్ కూడా గ్యాంగ్ స్టర్ కావటం గమనార్హం. కాల్పుల ఉదంతంపై ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన దాని ప్రకారం.. వివాహ వేడుకల్లో భాగంగా డీజే ఏర్పాట్లు చేశారు. అతిధులు డీజేపీకి తగ్గట్లు స్టెప్పులు వేస్తున్నారు.

ఇలాంటి ఉత్సాహపూరిత వాతావరణంలోకి వచ్చిన ఒక యువకుడు డీజే సౌండర్ ను తగ్గించాలని కోరారు. ఆ టైంలోనే అక్కడకువచ్చిన అమర్ ప్రీత్.. సదరు వ్యక్తం అక్కడేం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతలోనే అమర్ ప్రీత్ పై సదరు వ్యక్తి తన దగ్గరున్న పిస్టల్ తో అతి దగ్గర నుంచి కాల్చి చంపేసినట్లు చెబుతున్నారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయినప్పటికి తీవ్ర గాయాల భారీగా పడిన అతన్ని సీపీఆర్ చేసి సేవ్ చేద్దామని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే.. ఈ హత్య వెనుక అసలేం జరగింది? అన్న ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది. పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు.