హిజ్రాల మధ్య సినిమా రేంజ్ లో గ్యాంగ్ వార్ .. రీజన్ ఏంటో తెలుసా ?

Thu Jul 29 2021 16:03:20 GMT+0530 (IST)

Gang war in the movie range between Hijras

రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లాలో హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ఈ వ్యవహారంలో రాజమౌళి సినిమాలో ఉండే విధంగా ఊహించలేని ట్విస్టులు ఉండటం గమనార్హం. బెంగళూరు వర్సెస్ రాయలసీమకి చెందిన హిజ్రాల గ్యాంగ్స్  మధ్య ఈ వార్ సాగుతుంది. అసలు గ్యాంగ్ వార్ కి కారణం ఎవరు ఏమైంది అనే విషయాల గురించి వివరాల్లోకి వెళ్తే .. అనంతపురం కేంద్రంగా రాయలసీమ హిజ్రాల సంఘం గత కొన్ని రోజుల ముందు ఆషాడ బోనాల పండుగ నిర్వహించింది. ఈ వేడుకలకు బెంగళూరుకు చెందిన హిజ్రాల సంఘం నుంచి కొందరు హాజరయ్యారు. ఆ వేడుకల్లో పాల్గొన సమయంలో రాయలసీమ హిజ్రాల బ్యాచ్ మధ్య మంచి ఐఖ్యత ఉన్నట్లు బెంగళూరు హిజ్రాలు గుర్తించారు.దీనితో వారిని ఆందోళనకు గురిచెయ్యాలని  గొడవ సృష్టించాలని పథకం వేసి రాయలసీమ హిజ్రాల బ్యాచ్ లో ఒకరిని బెంగళూరు గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. ఈ విషయం రాయలసీమ బ్యాచ్ కి తెలియడంతో ప్రతీకారంగా బెంగళూరు బ్యాచ్ హిజ్రాలలో ఒకరిని కిడ్నాప్ చేశారు. దీంతో రెండు బ్యాచ్ లమధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలోనే రాయలసీమ బ్యాచ్‌కు చెందిన ఒకరిపై అటాక్ చేసిన బెంగళూరు గ్యాంగ్ నగలు డబ్బుతో ఉడాయించింది. దీంతో ప్రస్టేజ్ గా తీసుకున్న రాయలసీమ బ్యాచ్ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్దమైంది. తమ వైపు వాళ్లను వదిలితే మీ వైపు వాళ్లను వదులుతామంటూ ఇరు వర్గాలు పరస్పరం డీల్ కుదుర్చునేందుకు మంతనాలు జరుపుతున్నాయి. వీరి వ్వవహారం శృతి మించడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడులు ప్రతి దాడులకు దిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ స్థానికంగా పెద్ద చర్చకి దారితీస్తుంది.