గుడ్‌న్యూస్: ఆగస్ట్ 14 నాటికి కరోనాకి వ్యాక్సిన్ !

Tue Jul 14 2020 20:00:22 GMT+0530 (IST)

Good News: Pandemic vaccine by August 14!

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తూనే ఉంది. అన్నిదేశాల్లో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ కరోనా మహమ్మరికి చెక్ పెట్టేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్ ను కనుగునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా కు చెందిన గమేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మైక్రో బయాలజీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు మనుషుల మీద విజయవంతమయ్యాయి. దీనికి సంబంధించిన టీకా మిగిలిన ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకొని ఆగస్టు 12వ తేదీ నుండి 14వ తేదీ మధ్య ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అని గమేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాగా భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి 9 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 28498 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశంలో 28 వేల కేసులు నమోదవ్వడం ఇది వరుసగా మూడో రోజు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 9 07645కు చేరింది. ఒక్క రోజులో 540 మంది వైరస్‌తో పోరాడి మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 23727కు చేరింది. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 3363056 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 1884967 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం నాటికి 13 మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.