Begin typing your search above and press return to search.

డీహెచ్.. పక్కా పొలిటికల్ కామెంట్స్

By:  Tupaki Desk   |   28 March 2023 4:16 PM GMT
డీహెచ్.. పక్కా పొలిటికల్ కామెంట్స్
X
అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే ప్రభుత్వం సాఫీగా సాగుతుంది. అయితే ఎవరి విలువ వారికే ఉంటుంది. కానీ ఈమధ్య కొందరు అధికారులు రాజకీయంగా ఎదిగేందుకు ప్రజాప్రతినిధులకు అనుగుణంగా మారుతున్నారు. వారికి మెప్పు పొందేందుకు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసర రావు చేసే కామెంట్స్ పక్కా పొలిటికల్ కు ఎంట్రీ ఇచ్చే విధంగా ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆయన కొత్తగూడెం నియోజకవర్గం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉందని, మంత్రి హరీష్ రావు చేతిలో పెడితే ఎప్పుడో అభివృద్ధి చెందేదన్నారు. దీంతో స్థానిక బీఆర్ఎస్ నేతలు గడలపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఆయన కొత్తగూడెం టికెట్ కోసం ఇలాంటి కామెంట్ చేస్తున్నారన్న చర్చ సాగుతోంది.

గతంలో గడల శ్రీనివాసరావు సంచలన వ్యక్తిగా మారారు. సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంగా ఆయన కాళ్లు మొక్కడం వివాదాస్పదంగా మారుతోంది. అప్పటి నుంచి ఆయనపై ఎన్ని విమర్శలు వస్తున్నా గడల మాత్రం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే విధంగానే మాట్లాడుతున్నారు.

తన నియోజకవర్గంలో టికెట్ కోసమే గడల శ్రీనివాసరావు సీఎం కాళ్లు మొక్కారని, ప్రభుత్వం పరువు తీశారని బీజేపీ నేతలు విమర్శించారు. అవేమీ పట్టించుకోని ఆయన తాజాగా మరోసారి రాజకీయ కామెంట్లు చేసి హాట్ టాపిక్ గా మారారు.

అన్ని నియోజకవర్గాల్లో సిద్ధిపేట నియోజకవర్గం వందశాతం అభివృద్ధి చెందిందని, మంత్రి హరీష్ రావు చేసిన అభివృద్ధిలో 50 శాతం ఇక్కడి నేతలు చేసినా కొత్తగూడం బాగుపడేదని అన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ బెస్ట్ మినిస్టర్ అని అన్నారు. హైదరాబాద్ కు పలు ఇండస్ట్రీల నుంచి పెట్టుబుడులు తీసుకొస్తూ ఎంతో మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. అందుకే హరీష్ రావు, కేటీఆర్ లు ఆదర్శ మంత్రులుగా నిలుస్తారని ఆయన అన్నారు.

అయితే కొత్తగూడెంను ఇప్పుడున్న నేతలు అభివృద్ధి చేయలేదన్న విమర్శలపై స్థానిక నేతలు బగ్గుమంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నేతలకే కాకుండా పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని అంటున్నారు. అధికారి హోదాలో ఉండి గడల శ్రీనివాసరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇంతకీ గడల వ్యాఖ్యలు టికెట్ కోసమేనా? అని రాజకీయంగా చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.