గ్రేటర్ టీఆర్ఎస్ దూకుడు.. మెజార్టీకి చేరువ.. తేలిపోయిన బీజేపీ

Fri Dec 04 2020 15:01:38 GMT+0530 (IST)

GHMC election results 2020

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందుకుంటూ గ్రేటర్ లో టీఆర్ఎస్ కారు దూసుకుపోతోంది. అధికార పార్టీకే హైదరాబాదీలు పట్టం కట్టినట్టు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. టీఆర్ఎస్ ఇప్పటికే 57 స్థానాలకు పైగా లీడ్ లో ఉంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే టీఆర్ఎస్ మొత్తం 150 సీట్లలో 60-70 సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గినా ఎంఐఎం 31 సీట్లతో లీడింగ్ లో ఉండడంతో మేయర్ పీఠం టీఆర్ఎస్ కే అనడంలో ఎలాంటి అనుమానాలు కలుగడం లేదు. మేయర్ డిప్యూటీ మేయర్ పంచుకొని టీఆర్ఎస్ అధికారం పంచుకొని చేపట్టవచ్చు.దుబ్బాకలో ఓటమి తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీపై ఫైట్ స్ట్రాట్ చేశాడు. బహిరంగ సభలో సైతం పాల్గొన్నాడు. దుబ్బాక ఫలితాన్ని జీహెచ్ఎంసీలో కొనసాగకుండా పకడ్బందీగా ముందుకెళ్లాడు. అభివృద్ధి వరదసాయం టీఆర్ఎస్ కు లాభించిందని తెలుస్తోంది.

అయితే గతంలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం 20-30 సీట్లు కోల్పోయే ప్రమాదంలో పడిపోయింది.

ఇక 2016లో 3 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ఈసారి 20-30 డివిజన్లు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 22 డివిజన్లలో లీడ్ లో ఉంది.

ఇక ఎంఐఎం కూడా అంచనాలు అందుకుంటోంది. 2016లో 44 డివిజన్లలో గెలిచిన ఎంఐఎం పార్టీ ఈసారి ఇప్పటికే 31 డివిజన్లలో లీడ్ లో ఉంది. మజ్లిస్ పట్టును నిలబెట్టుకున్నట్టు అర్థమవుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలవగా.. ఈసారి 3 స్థానాల్లో లీడ్ లో ఉంది.  

ప్రస్తుతం ట్రెండ్ ను బట్టి చూస్తుంటే గ్రేటర్ లో టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఒంటరిగా.. లేదంటే పొత్తులో మజ్లిస్ తో అధికారం పంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.