Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీలో హంగ్: టీఆర్ఎస్ 56 - బీజేపీ 49 - ఎంఐఎం 43 - కాంగ్రెస్ 2

By:  Tupaki Desk   |   4 Dec 2020 1:42 PM GMT
జీహెచ్ఎంసీలో హంగ్: టీఆర్ఎస్ 56 - బీజేపీ 49 - ఎంఐఎం 43 - కాంగ్రెస్ 2
X
జీహెచ్ఎంసీ: ప్రారంభమైన కౌంటింగ్, తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు‌

అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీ తలపడిన ఈ పోరులో అంతిమ విజయం ఎవరిదనేది కొద్దిసేపట్లో తేలనుంది. రెండు పార్టీలు విజయంపై ధీమాతో ఉన్నాయి.

గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ సిబ్బంది చేరుకొని తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ చేస్తున్నారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సుల లెక్కింపు జరుపనున్నారు.

కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. గ్రేటర్ ఎన్నికల్లో 74,67,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా 25 చొప్పున బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా భారతీనగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీహెఛ్ గోదావరి ముందంజలో ఉన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను మొదట లెక్కించారు. మొత్తంగా 9 గంటల వరకు బీజేపీ 23, టీఆర్ఎస్ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. 1,926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో గచ్చిబౌలి డివిజన్ లో వచ్చిన మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్టు కాగా ఒకటి టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది. అల్విన్ కాలనీలో బీజేపీకి 6, టీఆర్ఎస్ 1, హైదర్ నగర్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1, హయాత్ నగర్ బీజేపీ 8, టీఆర్ఎస్ 1, నాగోల్ బీజేపీ 13, టీఆర్ఎస్ 12 ఓట్లు వచ్చాయి.

జీహెచ్ఎంసీ కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ లో బీజేపీ 30, టీఆర్ఎస్ 15 డివిజన్లలో ఆధిక్యం సాధించింది. బేగం బజార్ లో బీజేపీ ఆధిక్యం సాధించింది. బీఎన్ రెడ్డి నగర్ లో బీజేపీ లీడ్ లో ఉంది. రామంతాపూర్ లో బీజేపీకి 8, టీఆర్ఎస్ 2 బ్యాలెట్ ఓట్లు లభించాయి. ఉప్పల్, మన్సూరాబాద్, హఫీజ్ పేట, నాగోల్, కవాటిగూడ, పటాన్ చెరు, కొండాపూర్ లో బీజేపీ ఆధిక్యం సాధించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 150 డివిజన్లలో లెక్కింపులో 46 డివిజన్లలో బీజేపీ లీడ్ లో ఉంది. ఆ తర్వాత 26 స్థానాల్లో టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. ఎంఐఎం 11, కాంగ్రెస్ 1 బంజారాహిల్స్ లో లీడ్ లో ఉంది. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది.

10.00 AM: జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్ లో కారు పార్టీ వెనుకబడింది. ముందుగా లెక్కించిన ఈ ఓట్లలో మెజారిటీ స్థానాల్లో బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో టీఆర్ఎస్ చేరింది. మొత్తం బ్యాలెట్ 1,926 ఓట్లు పోలయ్యాయి. వీటీలో ఖైరతాబాద్లో బీజేపీ 3, టీఆర్ఎస్ 1, గాంధీనగర్ లో బీజేపీ 7, టీఆర్ఎస్ 2, నోటాకు 1 , గడ్డి అన్నారం టీఆర్ఎస్ 2, బీజేపీ 10, టీడీపీ 1, చెల్లని ఓట్లు 3, బేగం బజార్ లో బీజేపీకి 6, టీఆర్ఎస్ కు 1, బీఎన్ రెడ్డి నగర్లో బీజేపీ 4 పోస్టల్ ఓట్లు లభించాయి. ఇక రామంతాపూర్ బీజేపీ 8, టీఆర్ఎస్ 2, ఉప్పల్ బీజేపీకి 10, టీఆర్ఎస్ కు 4 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఉద్యోగులు ఎక్కువగా బీజేపీకి ఓట్లు వేయడంతో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను చూపినట్లయింది. కాగా 40 శాతం చెల్లని ఓట్లుగా ఉన్నట్లు సమాచారం.

10.35 AM : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను లెక్కిస్తున్నారు. ఉదయం 10.30 గంటల వరకు బీజేపీ 83, టీఆర్ఎస్ 34, ఎంఐఎం 18 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇప్పుడు ప్రజల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో తొలి రౌండ్ ఫలితం రానుంది.

11.25 Am: గోషా మహల్ నియోజకవర్గం పరిధిలోని జాంబాగ్ డివిజన్ లో ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బూత్ నంబర్ 8లో 471 ఓట్లు పోలవ్వగా బాక్సులో 257 మాత్రమే ఉన్నాయి. మిగతా ఓట్ల గల్లంతుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలింగ్ శాతాన్ని తప్పుగా వెల్లడించామని అధికారులు వివరణ ఇచ్చినా బీజేపీ నేతలు మాత్రం ఆందోళన విరమించలేదు.

11.30AM : జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసింది. 17 డివిజన్లలో ఆధిక్యం ఎవరికీ దక్కలేదు. కొన్ని డివిజన్లలో పోస్టల్ ఓట్లు నమోదు కాలేదు. మరికొన్ని చోట్ల అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు అధికారికంగా బీజేపీ 82 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. టీఆర్ఎస్ 31 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.

11.45AM: జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ ముగియడంతో ఇప్పుడు ప్రజల ఓట్లు లెక్కిస్తున్నారు. ఫలితాలు వెలువుడుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్సిపురం, పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే చందానగర్, హపీజ్ పేట్, హైదర్ నగర్, కాస్రా, మీర్ పేట, హెచ్బీ కాలనీ,చర్లపల్లి, ఓల్డ్ బోయినపల్లి, బోయినపల్లి, కాప్రా డివిజన్లలో లో టీఆర్ఎస్, కిషన్ బాగ్ లో ఎంఐఎం, లీడ్లో ఉంది. మొత్తంగా 18 చోట్ల టీఆర్ఎస్, 6 చోట్ల బీజేనీ, 2 చోట్ల ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. 14 డివిజన్లలో లెక్కింపు ఆలస్యం కానుంది.

11.50Am: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో ఉప్రదవం ఎదురైంది. మౌలాలి డివిజన్ లో లెక్కింపును అధికారులు నిలిపివేశారు. ఓ బ్యాలెట్ బాక్సులో 33 ఓట్లు అధికంగా ఉన్నాయి. మొత్తం 361 ఓట్లు పోలయ్యాయని అధికారులు పోలింగ్ రోజు ప్రకటించారు. అయితే బాక్సులో 394 ఓట్లు ఉన్నాయి. దీంతో ఏజెంట్ల అభ్యంతరంతో అధికారులు కౌంటింగ్ ను నిలిపివేశారు.ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు.

12.15: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వచ్చింది. చిన్న డివిజన్ కేవలం 11వేల ఓట్లు మాత్రమే పోలైన మోహిదిపట్నంలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ సాధించారు. హుస్సేన్ గతంలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్సిపురం, పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే చందానగర్, హపీజ్ పేట్, హైదర్ నగర్, కాస్రా, మీర్ పేట, హెచ్బీ కాలనీ,చర్లపల్లి, ఓల్డ్ బోయినపల్లి, బోయినపల్లి లో టీఆర్ఎస్ లీడ్లో ఉంది. మొత్తంగా 31 స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీ 12 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి.

12.35Am: పోస్టల్ ఓట్లలో వెనుకబడిన కారు సాధారణ ప్రజల ఓట్లకు వచ్చేసరికి గేరు మార్చి స్పీడ్ పెంచింది. తొలి రౌండ్ ఫలితాలు తాజాగా వెలువడుతున్నాయి. తొలి రౌండ్ సాధారణ ఓట్లలో టీఆర్ఎస్ 42 స్తానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 19, ఎంఐఎం 9, కాంగ్రెస్ 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. యూసఫ్ గూడలో టీఆర్ఎస్ తొలి సీటు గెలుచుకొని ఖాతా తెరిచింది. టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఇక్కడ కార్పొరేటర్ గా గెలిచాడు.

12.55 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఎస్ఆర్ రావునగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తొలి రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక చోట గెలుపొందడం విశేషం. ఇక మెట్టుగూడలో టీఆర్ఎస్ రెండో విజయాన్ని సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సునీత గెలిచారు. డబీర్ పూర్ లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి హుస్సేన్ ఖాన్ గెలుపొందారు.

1.35PM: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్, ఎంఐఎం పుంజుకున్నాయి. టీఆర్ఎస్ యూసుఫ్ గూడ(రాజ్ కుమార్ పటేల్), మెట్టు గూడ (సునీత) లో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఎంఐఎం మోహిది పట్నం, డబీర్ పూర్ , అహ్మద్ నగర్లో గెలుపొందింది. అడిక్మేట్, గాంధీనగర్, జడీమెట్ల, కొండాపూర్, గచ్చబౌలి,గోల్నాకలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా ఇప్పటి వరకు 57 స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీ 23, ఎంఐఎం 30, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ పరధిలోని ఏ ఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు.

2.00 PM:జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎంఐఎం పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించగా 14 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక టీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాల్లో గెలిచింది. 38 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 29 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో ముందంజలో ఉంది.

2.10 PM:పాతబస్తీలో ఎంఐఎం తన పట్టు నిలుపుకుంటోంది. మూడుస్థానాల్లో విజయం సాధించింది. బార్కాస్, పత్తర్ ఘట్, చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఆర్సీపురంలో టీఆర్ఎస్ మరో విజయం సాధించింది. గచ్చిబౌలిలో బీజేపీ 650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు.. కొన్ని కీలకమైన డివిజన్లలో మాత్రం వెనుకంజలో వెళుతోంది. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సగూడ పరిధిలో 8వ డివిజన్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్న వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక ఖైరతాబాద్, సోమాజిగూడలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 6 స్థానాల్లో టీఆర్ఎస్, 15 స్థానాల్లో ఎంఐఎం, ఒక్కో స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ గెలుపొందాయి.

3.33PM :టీఆర్ఎస్ 70, ఎంఐఎం 45, బీజేపీ 30 , కాంగ్రెస్ 4 లీడ్

జీహెచ్ఎంసీ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 70, 45 డివిజన్లలో ఎంఐఎం, 30 డివిజన్లలో బీజేపీ , 4 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నారు.

3.45: గ్రేటర్ ఎన్నికల్లో 2 స్థానాల్లో బీజేపీ విజయం.. 36 స్థానాల్లో లీడింగ్

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ రెండు డివిజన్లను కైవసం చేసుకుంది. తాజాగా ముషీరాబాద్ నుంచి ఎం.సుప్రియ, గచ్చిబౌలి నుంచి గంగాధర్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 3 డివిజన్లు గెలిచినట్టైంది. మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హబ్సిగూడ, బేగంబజార్, ముసాపేట్, ముసారాంబాద్, మొండా మార్కెట్, సైదాబాద్ లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ 14 స్థానాలో గెలుపొందగా, ఎంఐఎం 23స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది.

4.40PM: గ్రేటర్ లో టీఆర్ఎస్, ఎంఐఎం ఊపు

గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్, ఎంఐఎం హవా కొనసాగుతోంది. టీఆర్ఎస్ తాజాగా గాజుల రామారం, బాలాజీనగర్ డివిజన్లలో విజయం సాధించింది. ఖైరతాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పి.జనార్ధన్ కూతురు పి. విజయారెడ్డి గెలుపొందారు. ఈమె మేయర్ రేసులో ఉన్నారు. ఇక ఎంఐఎం ఇప్పటివరకు 25 డివిజన్లలో విజయం సాధించి మరో 15 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

4.48PM: జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ 33, ఎంఐఎం 31, కాంగ్రెస్ 2, బీజేపీ 19 చోట్ల విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు 90 స్థానాలకు సంబంధించిన ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో టీఆర్ఎస్ 38 స్థానాల్లో లీడ్ లో ఉండగా 33 చోట్ల విజయం సాధించినట్టు తెలిపింది. ఇక బీజేపీ 19 స్థానాల్లో లీడ్ లో ఉందని.. 17 చోట్ల విజయం సాధించిందని తెలిపింది. కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్ లో ఉండగా.. 2 చోట్ల విజయం సాధించింది. ఇక ఎంఐఎం 31 స్థానాల్లో విజయం సాధించగా 8 స్థానాల్లో లీడ్ లో ఉంది.

5.48PM: జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ 51, ఎంఐఎం 38, కాంగ్రెస్ 2, బీజేపీ 39 చోట్ల విజయం

టీఆర్‌ఎస్‌ 51 డివిజన్లలో గెలుపొంది 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఎంఐఎం 38 స్థానాల్లో విజయం సాధించి 4 డివిజన్లలో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ 39 డివిజన్లను కైవసం చేసుకుని 6 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మెహదీపట్నం డివిజన్‌ ఫలితం మొదటిగా వెలువడంతో ఎంఐఎం విజయం సాధించింది.

6.18 pm: కూకట్‌పల్లి సర్కిల్ లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

కూకట్‌పల్లి సర్కిల్‌ను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆరుకు ఆరు డివిజన్లను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. 119 డివిజన్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నర్సింహా యాదవ్ గెలుపొందారు. 120 డివిజన్ బాలానగర్‌లో ఆవుల రవీందర్ రెడ్డి 3748 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 121 డివిజన్‌ కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ 749 ఓట్లతో, 122వ డివిజన్ వివేకానంద నగర్‌లో మాధవరం రోజా రంగారావు, 123వ డివిజన్ హైదర్ నగర్‌లో నార్నే శ్రీనివాస్ రావు 2010 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 124వ డివిజన్ ఆల్విన్ కాలనీలో దొడ్ల వెంకటేష్ గౌడ్ 1208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉండే ఈచోట టీఆర్ఎస్ గెలవడంతో ఈసారి ఆంధ్రా ఓటర్లు అంతా టీఆర్ఎస్ కే పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

7.00PM: జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ 52, ఎంఐఎం 42, కాంగ్రెస్ 2, బీజేపీ 44 చోట్ల విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో టీఆర్ఎస్ 52 చోట్ల విజయం సాధించినట్టు తెలిపింది. మరో 3 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక బీజేపీ 44 స్థానాల్లో విజయం సాధించి మరో 6 స్థానాల్లో లీడ్ లో ఉంది..కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఎంఐఎం 42 స్థానాల్లో విజయం సాధించగా 1 స్థానాల్లో లీడ్ లో ఉంది.

7.10: జీహెచ్ఎంసీలో హంగ్: టీఆర్ఎస్ 56,బీజేపీ 49, ఎంఐఎం 43, కాంగ్రెస్ 2

తెలంగాణలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏదో ఒక పార్టీకే పట్టం కట్టారు. కానీ దుబ్బాక ఫలితం నుంచి సీన్ మారుతోంది. దుబ్బాకలో కేవలం వెయ్యికి పైగా ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు హైదరాబాదీ ఓటరు ఏకంగా హంగ్ ఇచ్చాడు. ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వకుండా డోలాయమానంలోకి నెట్టాడు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తుదిదశకు చేరాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్తానాలతో లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత ఎంఐఎం 42 స్థానాల్లో గెలిచి 1 స్థానంలో లీడ్ లో ఉంది. బీజేపీ 45 గెలిచి 4 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.