రేవంత్ - సీఎం రమేష్ ల గురించి కొత్త నిజం !

Sat Oct 20 2018 18:29:34 GMT+0530 (IST)

టీడీపీ - కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జీవీఎల్ ఈ సందర్భంగా పలు అంశాల ఆధారంగా విరుచుకుపడ్డారు. 'టీడీపీ ఎంపీ సీఎం రమేష్ - కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిలు రాజకీయాలను అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించారు. వారిద్దరూ రాజకీయ ఇంద్రులు.. వాళ్ల ఇళ్లను చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది' అని ఆరోపించారు. 'రమేష్ కు - రేవంత్ కు చదువు లేదు - బ్యాక్ గ్రౌండ్ లేదు. అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?' అని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు సూటిగా ప్రశ్నించారు.వాళ్లకువాళ్లు సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటే సరిపోదని.. ఐటీ అధికారులతోపాటు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రచారంతో తమకే లాభమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు నాయకులెవరూ లేరని.. ఆ పార్టీకి పెయిల్యూర్ లీడరైన రాహులే దిక్కని జీవీఎల్  ఎద్దేవా చేశారు.ల్యాండ్ సెటిల్ మెంట్ - కబ్జాలతో రేవంత్ రెడ్డి కోట్లు సంపాదించారని - రేవంత్ రెడ్డిపై ఐటీ రిపోర్ట్ బయటకు వచ్చిందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. సెటిల్‌మెంట్లతో రూ.11కోట్ల నల్లధనం వచ్చిందని రేవంత్ రెడ్డి బావమరిది చెప్పారని వివరించారు. రేవంత్ రెడ్డి మామ దగ్గర 11 లక్షలు - బావమరిది దగ్గర 1.2 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారన్నారు. కేఎల్ ఎస్ ఆర్ ఇన్ ఫ్రాటెక్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి దగ్గర రూ.1.40కోట్లు దొరికాయన్నారు. కేఎల్ ఎస్ ఆర్ సంస్థ బినామీ సంస్థగా తేలిపోయిందన్నారు. ``రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీ భూపాల్ - ఇన్ ఫ్రాటెక్ సబ్ కాంట్రాక్టు పనులు చేసింది. కేఎల్ ఎస్ ఆర్ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టు పనులు తీసుకున్నారని జీవీఎల్ వెల్లడించారు. కూలీలకు డబ్బులు ఇచ్చామని అనేక రెట్లు పెంచి చూపించారు. కేఎల్ ఎస్ ఆర్ సంస్థ రూ.20కోట్ల బోగస్ కాంట్రాక్టులు చూపుతోంది`అని అన్నారు. భూలావాదేవీలతో నల్లధనాన్ని సంపాదించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కుంభకోణానికి పాల్పడ్డాడని తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా కబ్జాల ఆరోపణులున్నాయని జీవీఎల్ తెలిపారు. నేషనల్ హెరాల్డ్ సంస్థకు ఇచ్చిన భూముల్లో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తముడేమీ కాదని విమర్శించారు. భూకబ్జాదారులను వెనకేసుకొచ్చి తప్పు చేసిన ఉత్తమ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే 'ఇమ్మోరల్ నేషనల్ కరప్ట్ కాంగ్రెస్' అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో దందాలు చేసేవారికి మంచి గుర్తింపు ఉంటుందని జీవీఎల్ మండిపడ్డారు.