‘జూమ్’ చేసి చూస్తే.. ప్యాంట్ లేకుండా ఇంటర్వ్యూ.. ఆన్ లైన్లోనే రొమాన్స్..!

Wed Feb 24 2021 06:00:01 GMT+0530 (IST)

Funny And Embarissing Zoom Moments

ప్రపంచంలో కరోనా వైరస్ తీసుకొచ్చిన మార్పులు చెప్పాలంటే ఒకరోజైనా చాలదు. కొవిడ్ ధాటికి ఆర్థిక వ్యవహారాలు మొదలు.. ప్రజల దైనందిన జీవితం వరకు సర్వం మారిపోయాయి. లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాల ద్వారా ప్రపంచం మొత్తం నాలుగు గోడలకే పరిమితం కాగా.. తిండికి అవస్థలు పడ్డ వారికి లెక్కే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ప్రధానమైన మార్పుల్లో ఒకటి వర్క్ ఫ్రమ్ హోం!జనాలు రోడ్డెక్కే అవకాశం లేకపోవడంతో దాదాపు కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించాయి. మీటింగులు చాటింగులు వర్క్ ఫైల్స్ అన్నీ ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ తో షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. పిల్లలు కూడా ఆన్ లైన్లో తరగతులు వినడం మొదలు పెట్టారు. ఇలా ఇంటి నుంచే ఆన్ లైన్లో పనులు చేసుకునేవారంతా ‘జూమ్ యాప్’ను యూజ్ చేస్తున్నారు.

కిందా పైనా పడి మొత్తానికి.. వర్క్ ఫ్రం హోంను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు ఉద్యోగులు. అయితే.. ఇక్కడే చిన్న చిన్న పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. అవి కంపెనీలకు నష్టాలు కలిగించేవి కాదు.. చూసే వారికి నవ్వు తెప్పించేటివి. చేస్తున్న వారు కాస్త ‘హయ్యో నా మతిమండా..’ అని తర్వాత నాలుక కరుచుకునేవి. తరచూ ఎక్కడో ఒక చోటు చేసుకుంటున్న ఈ జూమ్ మిస్టేక్స్ తెగ ఫన్ క్రియేట్ చేస్తున్నాయి.

జూమ్ యాప్ లో ఆన్ లైన్లో మీటింగులు వీడియో కాల్స్‌లో చోటు చేసుకున్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇప్పటి వరకు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి సంఘటలన్నీ ఒకే వీడియోగా మార్చి ఆన్ లైన్లో అప్ లోడ్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒక వీడియోలో ఎంప్లాయ్ ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయి షార్ట్ మీదనే తన మీటింగ్  కంప్లీట్ చేశాడు. ఇక మరో వీడియోలో దంపతుల చిలిపి రొమాన్స్ అందరికీ హాయినిచ్చే నవ్వులు పంచింది.

ఓ ఉద్యోగి జూమ్ మీటింగ్ లో ఉండగా.. అతని శ్రీమతి ముద్దు పెట్టడానికి వచ్చింది. దీంతో.. గాబరా పడిపోయిన అతగాడు.. నేనేం చేస్తున్నానో కనిపిస్తోందా? అని ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ఇది చూసిన అందరూ చిలిపిగా నవ్వుకున్నారు. ఇలాంటివన్నీ వ్యూయర్స్ కు నవ్వులు పంచితే.. పాపం బాధితులు మాత్రం ‘వార్నీ.. ఎంత పని జరిగిపోయిందీ..?’ అని తర్వాత నాలుక కరుచుకుంటున్నారు.