Begin typing your search above and press return to search.

9 రోజుల్లో పెళ్లి.. సీఎం వస్తున్నారు.. ఫంక్షన్ హాల్ ఇవ్వమంటూ ఫోన్

By:  Tupaki Desk   |   31 May 2023 2:00 PM GMT
9 రోజుల్లో పెళ్లి.. సీఎం వస్తున్నారు.. ఫంక్షన్ హాల్ ఇవ్వమంటూ ఫోన్
X
పెళ్లంటే మాటలా? ఎన్ని పనులు ఉంటాయి? మరెన్ని ఏర్పాట్లు చేసుకోవాలి? అన్నింటికి మించి పెళ్లిళ్ల సీజన్ లో పెళ్లి లగ్నం కుదిరినంతనే మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఫంక్షన్ హాల్ బుకింగ్ కోసం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

అలాంటిది.. ఫంక్షన్ హాల్ ను ఎప్పుడో బుక్ చేసేస్తే.. పెళ్లికి తొమ్మిది రోజులు ముందు సదరు ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఫోన్ చేసి.. సీఎం కేసీఆర్ వస్తున్నారు.. ఫంక్షన్ హాల్ ఇవ్వలేం.. మీరేఎక్కడైనా వేదిక చూసుకోండన్న మాట ఇప్పుడు ఇప్పుడు ఆ పెళ్లింట షాకింగ్ గా మారింది.

మరో తొమ్మిది రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. శుభలేఖలు ఇప్పటికే అచ్చేసిన వేళ.. మళ్లీ ఫంక్షన్ హాల్ అంటే ఎలా? ఏం చేయాలో పాలుపోక కిందామీదా పడుతున్న వైనం మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన పోతు సత్యనారాయణకు ఎదురైంది.దీంతో.. వారి ఫ్యామిలీ కిందా మీదా పడుతున్నారు.

సింగరేణి ఆర్కే 5బి గనిలో సపోర్టుమెన్ గా పని చేస్తున్న సత్యనారాయణ కుమార్తె శిరీష వివాహం జూన్ 9న ఉదయం 7.41 గంటలకు డిసైడ్ చేశారు. పెళ్లి వేడుక కోసం తాను పని చేస్తున్న శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి సంస్థకు చెందిన సీసీసీలోని సింగరేణి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ను మే 10న బుక్ చేసుకున్నారు. అప్పటి నుంచి పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా సింగరేణి అధికారులు ఫోన్ చేసి.. జూన్ 9న ముఖ్యమంత్రి పర్యటన ఉందని.. తాము ఫంక్షన్ హాల్ ఇవ్వలేమని తేల్చేశారు. దీంతో పెళ్లి కుమార్తె తండ్రికి దిక్కుతోచని పరిస్థితి.

ఇప్పటికే శుభలేఖలు ప్రింట్ కావటం.. వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటంతో ఇప్పుడేం చేయాలో పాలుపోని పరిస్థితి. జూన్ 9న పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో సీసీసీ.. శ్రీరాంపూర్ లోని సింగరేణికి చెందిన అన్ని పంక్షన్ హాళ్లు బుక్ కావటం.. ముఖ్యమంత్రి టూర్ సందర్భంగా వాటిని క్యాన్సిల్ చేయటంతో.. పెళ్లి జరుగుతున్న తల్లిదండ్రులకు మహా ఇబ్బందిగా మారింది. ఈ ఇష్యూను సీఎం మాత్రం సాల్వ్ చేయగలరని అంటున్నారు. మరి..మీడియాలో వచ్చిన ఈ అంశంపై సీఎం ఎలా రియాక్టు అవుతారో చూడాలి.