Begin typing your search above and press return to search.

విగ్ర‌హం మీద చేయేస్తే.. కాల్చి పారేస్తా.. నాకొ.. క‌ల్లారా!!

By:  Tupaki Desk   |   29 May 2023 8:20 PM GMT
విగ్ర‌హం మీద చేయేస్తే.. కాల్చి పారేస్తా.. నాకొ.. క‌ల్లారా!!
X
తెలంగాణ‌లో రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య సింప‌తీ కోసం.. పార్టీల నేత‌లు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వివాదాలు చోటు చేసుకోవ‌డంతోపాటు.. మాట‌ల తూటాలు కూడా పేలుతున్నాయి. తాజాగా బీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య తీవ్ర మాటల యుద్ధం జ‌రిగింది. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నించ‌గా.. కాంగ్రెస్ నేత‌లు అడ్డు త‌గిలారు.

వనపర్తి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ నేత‌లు.. స్థానిక రోడ్ల విస్త‌ర‌ణ ప‌ప‌నులు చేప‌ట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఎప్ప‌టి నుంచో డిమాండ్‌గా ఉన్న ఈ ప‌నులు చేప‌ట్టేందుకు కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. ఈ రహదారి విస్తరణలో రాజీవ్ గాంధీ విగ్రహం అడ్డుగా ఉంది. దీంతో ఈ విగ్ర‌హాన్ని తొలగించాలని స్థానిక అధికారుల‌కు బీఆర్ ఎస్ నేత‌లు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.

అయితే.. ఈ విజ‌యంలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత‌, మాజీ మంత్రి చిన్నారెడ్డి.. తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజీవ్‌గాంధీ విగ్ర‌హంపై ఎవ‌రైనా చేయేస్తే.. తుపాకీతో కాల్చేస్తా నా కొ..క‌ల్లారా! అని హెచ్చ‌రించారు. కూడళ్లలో జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని చూడటం ఎంతవరకు సమంజసమని చిన్నారెడ్డి ప్రశ్నించారు.

అంతేకాదు.. దీనికి ముందు వనపర్తిలో రోడ్డు విస్తరణ సందర్భంగా పాతబజార్ లోని దర్గా, ఓ ఆలయ స్వాగత తోరణం తొలగించినందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీంతో విష‌యం తెలుసుకున్న బీఆర్ ఎస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసు కుంది. ఒక‌రిపై ఒక‌రు భౌతిక దాడుల‌కు కూడా దిగారు. ఈ క్ర‌మంలోనే చిన్నారెడ్డి తీవ్ర‌స్వ‌రంతో హెచ్చ‌రించారు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి ఇరు ప‌క్షాల‌ను శాంతిప‌జేశారు.