Begin typing your search above and press return to search.

తెలంగాణలోనూ అన్ని పార్టీల ఫోకస్ కాపులే..

By:  Tupaki Desk   |   27 Jan 2023 8:00 PM GMT
తెలంగాణలోనూ అన్ని పార్టీల ఫోకస్ కాపులే..
X
ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే కులసంఘాల ఓట్లు కీలకం. ఈ విషయం తెలిసిన నాయకులు వారిని మచ్చిక చేసుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతారు. వారి కోసం ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటారు. విభాజిత ఏపీలో ప్రస్తుతం కాపు వర్గానికి చెందిన ఓట్లే కీలకం. ఎన్నో ఏళ్లుగా వారికి రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ, వైసీపీ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణలోనూ కాపు ఓట్లే కీలకం కానున్నాయి. అందుకోసం రాజకీయ పార్టీలన్నీ కాపు వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు వారిని అక్కున చేర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వారి మద్దతుతోనే అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే కొందరు కాపు నేతలకు అత్యున్నత పదవులు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో మరింత ప్రయోజనం కల్పిస్తామని ప్రచారం చేయనుంది. అటు బీజేపీ సైతం రాష్ట్ర అధ్యక్షుడిని కాపు నేతను నియమించి వారిని ఆకట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో కాపు నేతను సీఎం చేసే అవకాశం ఉందంటూ ప్రజల్లోకి వెళ్లనుంది.

ఏపీలో 25 శాతం ఉన్న కాపులు.. తెలంగాణలో 12 శాతం ఉన్నారు. మిగతా వర్గాల కంటే ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ రాజకీయాల్లో వీరే కీలకం కానున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాపు నేతలే ఎక్కువగా ఉన్నారు. కానీ తమ నాయకుడు సీఎం కాలేకపోయాడన్న భావన అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో ఉంది. దీంతో తమ నేతను ఎవరూ సీఎం చేస్తారో ఆ పార్టీకే మద్దతు ఇస్తామని తాజాగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ లో ఇటీవల తెలంగాణ, ఏపీకి చెందిన కాపు నేతలు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చించాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కాపు వర్గానికి న్యాయం చేసినట్లు ప్రచారం చేయనుంది. మున్నూరు కాపునకు చెందిన గంగుల కమాలకర్ కు మంత్రి పదవిని ఇచ్చింది. అంటే కేశవరావుకు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. ఇక బాజిరెడ్డి గోవర్దన్ కు ఆర్టీసీ చైర్మన్ పదవి, వద్ది రాజు రవిచంద్రకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్, దండ విఠల్, నన్నపనేని నరేందర్ తదిరులు ఉన్నారు. తాము ఇప్పటికే కాపు వర్గానికి న్యాయం చేశామని, రానున్న రోజుల్లో మరింత ప్రయోజనం కల్పిస్తామని బీఆర్ఎస్ ప్రచారం చేయనుంది.

అటు బీజేపీ సైతం కాపు వర్గంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడ బండి సంజయ్ నేతను నియమించగా.. లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో అనుకున్న సీట్లు వస్తే బండి సంజయ్ లేదా లక్ష్మణ్ ను సీఎం చేస్తామని ఢిల్లీ నేతలు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా కాపు వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో బీజేపీ కాపు ఓట్లను మచ్చిక చేసుకుంటే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తోంది. ఇదీ కాకపోతే కాపు వర్గానికి చెందిన జనసేనను రంగంలోకి దించి ప్రచారం చేయించనుంది. గతంలో కాంగ్రెస్ కూడా కాపు వర్గాన్ని ఆదరించిందని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు.

అయితే కాపు నేతలు ఏ పార్టీని ఆదరిస్తారోనన్నది కీలకంగా మారింది. ఏపీలో రిజర్వేషన్ల పరంగా తమకు ఇప్పటివరకు టీడీపీ, వైసీపీలు మోసం చేశాయని ఆరోపిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ అవకాశాన్ని జనసేన తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. తెలంగాణలో మాత్రం అన్ని పార్టీల మధ్య కాపు వర్గాన్ని ఆదరించాలని పోటీ పడుతున్నారు. వారి మద్దతు లభిస్తే విజయం ఖాయమన్న భావనలో ఉన్నారు. మరి చివరికి వారు ఏ పార్టీని ఆదరిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.