Begin typing your search above and press return to search.

హన్సిక పెళ్లిలో మోనా మోత్వాని వార్నింగ్..

By:  Tupaki Desk   |   21 March 2023 8:00 AM GMT
హన్సిక పెళ్లిలో మోనా మోత్వాని వార్నింగ్..
X
సౌత్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని గత ఏడాది డిసెంబర్ లో తన ఫ్రెండ్ బిజినెస్ పార్ట్ నర్ సోహెల్ కతూరియాని పెళ్లాడిన విషయం తెలిసిందే. జైపూర్ లోని ముందోట ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీరి మ్యారేజ్ జరిగింది. అయితే ఈ మ్యారేజ్ కి కేవలం మోత్వాని, కతూరియా ఫ్యామిలీ సభ్యులు కొందరు అతిథులు మాత్రమే అటెండ్ అయ్యారు. హాన్సిక పెళ్లి వేడుకను వెబ్ సీరీస్ రూపంలో డిస్నీ హాట్ స్టార్ కి అమ్మిన విషయం తెలిసిందే.

సెలబ్రిటీల పెళ్లి వేడుకలను కూడా ఒక వెబ్ సీరీస్ గా తీసి దానితో కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. హాన్సిక పెళ్లి వేడుకని హాన్సికాస్ లవ్ షాది డ్రామా టైటిల్ తో ఈ వెబ్ సీరీస్ వచ్చింది. హిందీతో పాటుగా తెలుగు వర్షన్ కూడా ఇది అందుబాటులో ఉంది. అయితే పెళ్లిలో హడావిడి అంతా హాన్సిక తల్లి మోనా మోత్వానాదే అన్నట్టు కనిపిస్తుంది.

వెబ్ సీరీస్ లో మోనా మోత్వాని మాట్లాడుతూ పెళ్లి వేడుకలో తనకు జరిగిన ఇబ్బందిని చెప్పారు. ప్రతి వేడుకకు కతూరియా ఫ్యామిలీ చాలా లేట్ గా రావడం పట్ల ఆమెకి కోపం వచింది. దానితో ఆమె ఆలస్యంగా వస్తే నిమిషానికి ఐదు లక్షలు వసూలు చేస్తానని అన్నారు. సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు అశుభ గడియలు ఉన్నాయి అందుకే కాస్త ముందుగా రావాలని ఆమె రిక్వెస్ట్ చేశారు. అయితే మామూలుగా చెబితే బాగోదు అని.. అలా ఆలస్యం వస్తే నిమిషానికి ఐదు లక్షలు వసూలు చేస్తానని అన్నారట.

మొత్తానికి హాన్సిక వివాహ వేడుక ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ వేడుకల తెలుగు వర్షన్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. తెలుగు డబ్బింగ్ చెప్పినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే హన్సిక ఫ్యాన్స్ మాత్రం ఆమె పెళ్లి వేడుకలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.