హెడ్‌మాస్టర్ పోస్ట్ కోసం ఆఫీసులోనే ఫైటింగ్ .. !

Fri Oct 15 2021 18:00:01 GMT+0530 (IST)

Fighting in the office for the post of headmaster

ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురు చూడడం అనేది సర్వసాధారణం. అయితే ఆ ప్రమోషన్ల కోసమే ఉద్యోగుల మధ్య గ్రూపులు పైరవీలు కొనసాగుతాయి. సీనియారిటి ప్రకారం ప్రమోషన్లు ఇచ్చినా ఒక్కోసారి అవి ప్రభుత్వ పెద్దల అండదండలతో కొనసాగుతాయి. అయితే ఇలాంటీ సమయంలో ఉద్యోగుల మధ్య తమకు రావాల్సిన ఉద్యోగాన్ని ఇతరులు తన్నుకుపోవడం సహజంగా మారుతోంది. అయితే ఇలాంటి సంధర్భంలోనే ఓ టీచర్ తో పాటు మరో టీచర్ భర్త కలిసి ప్రమోషన్ కోసం కొట్టుకున్నారు. అదికూడా విద్యాశాఖ కార్యాలయం అవరణలోకి వచ్చి అందరు అధికారులు చూస్తుండగానే ఈ ఫైటింగ్ కొనసాగింది.దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిహార్ రాజధాని పట్నాలోని మోతీహరిలో విద్యాశాఖ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. బిహార్‌లోని ఆదాపూర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపల్ పోస్టు కోసం శివశంకర్ గిరి అనే వ్యక్తి రింకీ కుమారి అనే మహిళా ఉపాధ్యాయురాలు మూడు నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పోస్టుకు సీనియరిటీ పరంగా విద్యార్హతల పరంగా నేనంటే నేను బెటర్ అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. అయితే ఇద్దరి మధ్య వివాదం ముదురుతుండడంతో విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు.

ఈ క్రమంలో వీరిద్దరి విద్యార్హతలు తెలిపే సర్టిఫికెట్స్ మూడు రోజుల్లో కార్యాలయంలో అందజేయాలని ఆదేశించింది. అధికారుల ఆదేశాల మేరకు ఇద్దరూ సంబంధిత ధ్రువపత్రాలతో కార్యాలయానికి వెళ్లారు.అయితే.. ఎవరు ముందుగా ఆ పత్రాలను సమర్పించాలనే విషయంలో విద్యాశాఖ కార్యాలయంలోనే వారి మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త ముదిరి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన రింకీ కుమారి భర్త మరో ఉపాధ్యాయుడు శివశంకర్ గిరి తలను గట్టిగా పట్టుకున్నాడు. గిరి అతడి నుంచి విడిపించుకొనే ప్రయత్నంలో కింద పడిపోయారు. అయినా అతను వదిలిపెట్టకపోవడంతో అక్కడే ఉన్న కార్యాలయ సిబ్బంది వారిని విడిపించారు. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు.