Begin typing your search above and press return to search.

లోదుస్తుల్లో వచ్చి ఓటేశారు.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   22 May 2022 3:01 PM GMT
లోదుస్తుల్లో వచ్చి ఓటేశారు.. ఎందుకో తెలుసా?
X
ఎన్నికలు వచ్చాయంటే జనాలు క్యూలు కడుతారు. తమ అవకాశం వచ్చాక వెళ్లి ఓటు వేస్తారు. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ఈసారి ఓటర్లు ఓటు వేయడానికి ఓ కంపెనీ ప్రచారానికి వాడుకుంది. వాళ్లు స్విమ్ సూట్లలో వెళ్లి ఓట్లు వేస్తే దుస్తులతోపాటు బహుమతులు కూడా అందజేస్తామని పిలుపునిచ్చింది.దీనికి అదిరిపోయే స్పందన వచ్చింది.

ఆస్ట్రేలియాలో ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. తాజాగా ఈసారి కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. అక్కడి లేబర్ పార్టీ ఈసారి లిబరల్ పార్టీని ఓడించింది. 2007 తర్వాత లేబర్ పార్టీ గెలవడం ఇదే ప్రథమం. ఆ పార్టీ నేత ఆంటోని ఆల్బనీస్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్నారు.

అయితే పోలింగ్ సమయంలో ఒక వింత చోటుచేసుకుంది. ఓటు వేయడానికి చాలా మంది అండర్ వేర్స్ లో వచ్చి ఓట్లు వేశారు. ఒకరో ఇద్దరో కాదు.. చాలా మంది ఒంటిపై కేవలం అండర్ వేర్ తో మహిళలు, పురుషులు వచ్చి ఓటేయడం గమనార్హం. అయితే అలా వారంతా వెళ్లి ఓటు వేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది.

బడ్జీ స్మగ్లర్స్ అనే స్విమ్ వేర్ కంపెనీ ఇచ్చిన ఓ ఆఫర్ వల్లనే ఇలా వందలమంది లోదుస్తుల్లో వచ్చి ఓటు వేయడానికి కారణం. అండర్ వేర్ లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్ మీడియాలో షేర్ చేస్తే తమ బ్రాండెడ్ స్విమ్ వేర్ ను ఉచితంగా ఇస్తామని సంస్థ ప్రకటించింది.

కాగా ఈ ఆఫర్ ను చేజిక్కించుకునేందుకు అనేకమంది రంగురంగుల అండర్ వేర్ లలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసి ఆ ఫొటోలను 'స్మగ్లర్స్ డిసైడ్' అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశారు. తమ ఆఫర్ కు అనూహ్య స్పందన వచ్చిందంటూ బడ్జీ స్మగ్లర్స్ ఆనందం వ్యక్తం చేసింది. ఒకరిద్దరు పాల్గొంటారని భావిస్తే వందలమంది ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేసింది. ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న వారందరికీ సోమవారం నుంచి బహుమతులు అందజేస్తామని తెలిపింది.