Begin typing your search above and press return to search.

చిన్న కెమెరాలు.. మీ పర్మిషన్ లేకుండానే తీసేస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Sep 2021 12:30 PM GMT
చిన్న కెమెరాలు.. మీ పర్మిషన్ లేకుండానే తీసేస్తున్నారు
X
ఎదుటి వారి రహస్యాలు తెలుసుకునేందుకు రహస్య కెమెరాలు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో కెమెరాలో ఎక్కడెక్కడున్నాయో ముందే గ్రహించి చాలా మంది జాగ్రత్తపడుతున్నారు. కానీ రెబనాన్, ఫేస్ బుక్ కలిపి కొత్తగా సీక్రెట్ కెమెరాను వెలుగులోకి తెచ్చింది. ఈ కెమెరా కళ్లద్దాళ్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఫేస్బుక్ కళ్లజోడుగా పేర్కొంటున్న దీని గురించి తెలిసిన వాళ్లలో కొందరు ఆశ్చర్యపోతున్నా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి కళ్లజోళ్ల వల్ల ఉపయోగం కంటే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కానీ ఫేస్బుక్ మాత్రం వారి ఆరోపణలకు వివరణ ఇస్తూ వస్తోంది. అయితే ఫేస్బుక్ కళ్లద్దాల సంగతేంటి..? అవి ఎలా పనిచేస్తాయి..? అందులోని సీక్రెట్ కెమెరా ఎక్కడుటుంది...?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్ లైప్ బిజినెస్ రంగంలోకి దిగింది. ఇందులో భాంగా కొత్తగా కళ్లద్దాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా కనిపించి ఈ కళ్లజోడుతో సీక్రెట్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీయోచ్చు. అంతేకాకుండా క్లారిటీగా క్యాప్చర్ చేయొచ్చు.. ఎదుటివ వారికి తెలియకుండానే వారి ఫేస్ లు మొత్తం కెమెరాలో బంధించవచ్చు. అత్యంత ఆధునికంగా తీసుకొచ్చిన ఈ కళ్లద్దాలను చూసి ప్రతి ఒక్కరు లైక్లు కొడుతున్నారు. అయితే కొందరు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎదుటివారి అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీయడం వల్ల ప్రమాదమేనని అంటున్నారు.

యూరోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేటర్ ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఫేస్బుక్ ప్రతినిధులు ఇటీవల ఐర్లాండ్ డాటా ప్రొటెక్షన్ కమిషన్ ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. ఎదుటి వారి అనుమతి లేకుండా ఫొటోలు తీయడం అభ్యంతరమేనని కొందరు ఫిర్యాదు చేయడంతో వీరు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఫేస్బుక్ ప్రతినిధులు చెబుతున్న దాని ప్రకారం కళ్లజోడులో ఉన్న సీక్రెట్ కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీస్తుంటే అందులో చిన్న లైట్ ఏర్పడుతుంది. దీంతో వారు ఫొటోలు తీస్తున్నారా..? లేదా..? అని గుర్తించవచ్చని అంటున్నారు. వీరి సమాధానంతో డీపీసీ సంతృప్తి చెందింది. అయితే లైట్ చాలా చిన్నదిగా ఉండడం అది పెద్దగా కనిపించికపోవడంపై అభ్యంతరాలు లేవనెత్తింది.

ప్రజల భద్రతా విషయంలో స్మార్ట్ కళ్లజోడు ప్రభావం చూపుతుందని ఇటలీ ప్రైవసీ విభాగం కూడా అసంతృప్తి చెందింది. అయితే ఇలాంటి ఫేస్బుక్ కు కొత్తేమీ కాకపోవచ్చు. ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా ఆ సంస్థ మాత్రం తాను అనుకున్న పనిచేసుకుపోతుంది. ఇప్పటికే మార్కెట్లోకి అగుమెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలను విడుదల చేసింది. ఇప్పుడు డిపీసీ అభ్యంతరం చెప్పినా దానికి సమాధానాలు వెంటనే రెడీ చేస్తోంది. ఇక వచ్చే ఏడాదిలో ప్రముఖ కళ్లజోడు కంపెనీ లగ్జొటికా సహకారంతో మరో కళ్లజోడును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్ ఇదివరకే ప్రకటించారు.

ఎదుటివారి అనుమతి లేకుండా ఇలాంటి కళ్లజోడు ఎక్కువ దేశాల్లో వినియోగం జరగకపోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. స్మార్ట్ కళ్లజోడు గురించి తెలిసిన వారు ప్రతి ఒక్కరు అనుమానించాల్సిన పరిస్థితి వస్తుందని, దీంతో మనుషులు మధ్య నమ్మకాలు పోయి అనుమానాలు మిగులుతాయని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ కళ్లజోడుపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఫిర్యాదులపై సరైన సమాధానం ఇస్తామని ఫేస్బుక్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే రాను రాను వీటి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేబాన్ కళ్లజోడులో 5 ఎంపీ కెమెరా ఉంది. దీని ధర సుమారు 22 వేల రూపాయలు. ప్రస్తుతం యూకె, ఐర్లాండ్ లో అమ్ముతున్నారు. అక్కడి మార్కెట్ ను భట్టి ఇతర దేశాల్లోకి సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నారు.