న్యూజెర్సీలో ప్రవాస భారతీయ వ్యాపారులను హెచ్చరించిన ఎఫ్.బీఐ..

Wed Jun 29 2022 09:32:13 GMT+0530 (India Standard Time)

FBI warns expatriate Indian businessmen in New Jersey

ఆసియా అమెరికన్లు కష్టపడి పని చేసే వారని రేపటి కోసం పొదుపు చేసుకోవడం వారికి అలవాటు. వారు తమ వ్యాపారాలను నిర్వహించడం లేదా పని చేసే విషయంలో అత్యంత నిబద్ధత కలిగి ఉంటారు. ఇప్పుడు అమెరికా అత్యున్నత పోలీస్ వ్యవస్థ ఎఫ్.బీఐ న్యూజెర్సీలోని ఒక నిర్దిష్ట ప్రవాస భారతీయులు ఆసియన్ల జాతి సమూహానికి హెచ్చరికలు జారీ చేసింది. వారి ఆస్తులు వస్తువులు.. శ్రేయస్సు గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది.కొన్ని అత్యంత వ్యవస్థీకృత నేర సమూహాలు ఇప్పుడు భారతీయులు ఆసియన్ల వ్యాపారులను టార్గెట్ చేశారని ఎఫ్.బీఐ హెచ్చరించింది.  వ్యాపార యజమానులు.. ధనిక లేదా బాగా డబ్బున్న కుటుంబాల కదలికలను ఈ నేర ముఠా గ్రూపులు అనుసరిస్తున్నట్లు ఎఫ్.బీఐ నిఘాలో తేలింది. వారు తమ లక్ష్యాలను గుర్తించిన తర్వాత వారిని వెంబడిస్తున్నట్లు పోలీసుల  డేటాను సేకరించారు.

అదును చూసి భారతీయ ఆసియన్ల వ్యాపారాలపై దొంగతనానికి ప్లాన్ చేస్తున్నారని ఎఫ్.బీఐ హెచ్చరించింది. న్యూజెర్సీ  మిలియన్ డాలర్ల వ్యాపారాలను నడుపుతున్న ప్రవాస భారతీయులు ఆసియన్లతో నిండి ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసియా అమెరికన్ వ్యాపారవేత్తలు ఉంటున్న గార్డెన్ స్టేట్లో దొంగతనాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

తాజాగా భారతీయ నగల దుకాణంలో పగటిపూట చోరీ జరిగింది. అధునాతన ముఠాలు షాపులు తెరిచినప్పుడు.. ముగింపు సమయాల గురించి బాగా తెలుసుకుని పోలీసులు లేరని నిర్ధారించుకున్న తర్వాత ఈ దోపిడీలకు పాల్పడుతున్నారు. అలాగే ఆసియా-అమెరికన్లు తమ నగదును బ్యాంకుల్లో దాచుకోవడం లేదని అమెరికా అంతటా అందరికీ తెలిసిందే.

భారతీయులు ఆసియన్ ఇతర దేశాల వారు తమ నగదు బంగారాన్ని ఇంట్లో భద్రపరుచుకుంటారు. పెద్ద వ్యాపారస్తులను టార్గెట్ చేసి దొంగలు వారి ఇళ్లలోకి ప్రవేశించడానికి కారణం అదే. మరిన్ని దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నందున నిర్దిష్ట ప్రవాసుల సమాజాన్ని ఎఫ్.బీఐ హెచ్చరించింది.

ఎఫ్.బీఐ ఇప్పుడు ఆసియా కమ్యూనిటీ వారి భద్రత కోసం వారి డబ్బు విలువైన వస్తువులను బ్యాంకుల్లో ఉంచాలని అభ్యర్థిస్తోంది. వారి ఇళ్ల సమీపంలోని కార్లపై లైసెన్స్ ప్లేట్ నంబర్లను ట్రాక్ చేయడానికి లైసెన్స్-రీడర్ పరికరాలను కొనుగోలు చేయాలని సూచిస్తోంది. ఈ కమ్యూనిటీలు భద్రతా వ్యవస్థను ఇన్స్టాల్ చేయాలని.. ఏదైనా  అనుమానాస్పదంగా ఉన్నట్లయితే స్థానిక పోలీసులకు నివేదించాలని తద్వారా వారు  ఎఫ్బీఐ నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు.