369 కోట్లతో భారతదేశంలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్

Fri Mar 31 2023 11:27:08 GMT+0530 (India Standard Time)

Expensive Apartment Deal in India

అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్ దక్షిణ ముంబైలో జరిగింది. కాంటార్సెప్టివ్ మేకర్ ఫేమీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా లోధా గ్రూప్ నుండి రూ. 369 కోట్లతో సౌత్ ముంబైలోని మలబార్ హిల్లో విలాసవంతమైన సముద్రానికి అభిముఖంగా ఉన్న ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు. సూపర్-లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ లోధా మలబార్ లో 2627 మరియు 28 అంతస్తులలో అపార్ట్మెంట్ ఫ్లాట్ ను ఈ భారీ ధరకు కొన్నాడు. ఇది దేశంలోనే ఖరీదైన డీల్ గా ప్రసిద్దికెక్కింది. దక్షిణ ముంబైలోని వల్కేశ్వర్ రోడ్లో ఈ అపార్ట్ మెంట్ ఉంది."ఈ డీల్ లో మొత్తం 27160 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ట్రిప్లెక్స్ ఫ్లాట్ ను చదరపు అడుగులకు దాదాపు రూ. 1.36 లక్షల చొప్పున కొన్నారు.  ఈ మొత్తం విలువ 369 కోట్ల రూపాయలు. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది" అని బిజినెస్ వర్గాలు చెబుతున్నారు.

దేశంలోని లగ్జరీ హౌసింగ్ మార్కెట్లో ఇది అత్యంత ఖరీదైనదిగా పేర్కొటున్నారు. ఇది మంచి డిమాండ్ ఊపందుకోవడానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఫిబ్రవరిలో డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కుటుంబ సభ్యులు సహచరులు ముంబైలో రూ. 1238 కోట్ల విలువైన 28 హౌసింగ్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇది బహుశా భారతదేశంలో అతిపెద్ద ఆస్తి ఒప్పందం

అదే నెలలో రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడానికి చెంబూర్లోని రాజ్ కపూర్ బంగ్లాను కొనుగోలు చేసింది. గత వారం రియల్టీ మేజర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ కూడా గురుగ్రామ్లోని తన హౌసింగ్ ప్రాజెక్ట్లో రూ. 7 కోట్లు అంతకంటే ఎక్కువ ధర కలిగిన 1137 లగ్జరీ అపార్ట్మెంట్లను 3 రోజుల్లో రూ. 8000 కోట్లకు విక్రయించినట్లు ప్రకటించింది.

లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్ పై పన్నులు ఇతర నిబంధనలతో అందరూ  ఏప్రిల్ 1కి ముందే ఈ భారీ డీల్స్ కొంటున్నారు. దీనికి పన్ను పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే బడ్జెట్ లో వీటిపై పన్ను ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన బడ్జెట్ ప్రసంగం 2023లో "అపార్ట్ మెంట్స్ కొనుగోలుపై  గరిష్ట స్థాయి పన్నుని ప్రతిపాదించాను.

సెక్షన్ 54 54F కింద నివాస గృహంలో పెట్టుబడిపై మూలధన లాభాల నుండి రూ. 10 కోట్ల వరకు పన్నులు కట్టాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే ఈ భారీ డీల్స్ ఏప్రిల్ 31 ముందే పూర్తి చేసుకుంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి రూ.10 కోట్లకు మించిన మూలధన ఆస్తులు పన్నుకు లోబడి ఉంటాయి.     


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.