కూతురి వయసు వలంటీర్‌తో కార్యదర్శి ప్రేమాయణం: రెండో పెళ్లికి సిద్ధం

Sat Jun 06 2020 15:00:17 GMT+0530 (IST)

Executive Preparing for a second wedding With Volunteer

తండ్రి వయసు ఉంటుంది.. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి.. ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ప్రేమాయణం సాగించి ప్రేమాయణం సాగించి ఏకంగా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ పెళ్లి పెటాకులైంది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఘటన జరిగింది.దాచేపల్లిలోని సయ్యద్ జాన్ పీరా పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. అతడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు పెళ్లి వయసుకు వచ్చారు. కుటుంబంతో కలిసి నారాయణపురంలో వారు భార్య పిల్లలతో కలిసి ఉండేవాడు. అయితే దాచేపల్లిలో పని చేసే ఓ మహిళా వాలంటీర్‌తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఆమెను రెండో పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. అతడు పని చేస్తున్న దాచేపల్లి మండలం పొందుగుల కార్యదర్శిగా బదిలీ అయ్యాడు. కానీ ఆ వాలంటీర్‌తో అతడు ప్రేమాయణం  సాగిస్తూనే ఉన్నాడు. వలంటీర్‌తో అతడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

అయితే ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీనిపై జాన్ పీరాపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అతడిపై కేసు నమోదు చేశారు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదుకు భిన్నంగా ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు తనను ఇబ్బంది పెడుతున్నారని 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుంది. దీంతోపాటు జాన్ పీరాపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరి ప్రేమ పంచాయతీ హాట్ టాపిక్‌గా మారింది. వీరి ప్రేమ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరింది.