Begin typing your search above and press return to search.

మోడీకి ఒక నాటి మిత్రుడి అంచనాకు అందరు ఆశ్చర్యపోతున్నారు

By:  Tupaki Desk   |   31 Oct 2020 5:20 PM GMT
మోడీకి ఒక నాటి మిత్రుడి అంచనాకు అందరు ఆశ్చర్యపోతున్నారు
X
బీజేపీ - శివసేన మధ్యనున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లక్క.. బంగారం మాదిరి కలిసిపోయిన ఈ రెండు పార్టీలు.. మోడీషాల దెబ్బకు ఎవరి దారి వారిదన్నట్లుగా మారింది. ఈ దూరం చివరకు మహారాష్ట్ర పీఠాన్ని చేజార్చుకునే వరకు వెళ్లింది. శివసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ అనుసరించిన మొండితనంతో.. కొత్త మిత్రుల్ని వెతుక్కుంటూ సేన వెళ్లిపోయింది. అందరి అంచనాలకు తగ్గట్లే ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం కాంగ్రెస్.. ఎన్సీపీలతో కలిసి సర్కారు ఏర్పాటు చేసిన సేన.. తనకేమాత్రం అవకాశం లభించినా మోడీషాలపై విరుచుకుపడేందుకు ఏ మాత్రం సందేహించటం లేదు. ఇదిలా ఉంటే.. పోటాపోటీగా సాగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాజాగా బీజేపీ ఎంపీసంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి తేజస్వి యాదవ్ ను నోరారా ప్రశంసించారు.
ఓపక్క కుటుంబ సభ్యులు జైల్లో ఉన్నా.. మరోవైపు పార్టీ నేతల నుంచి ఎదరయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ తన రాజకీయ ప్రత్యర్థి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచ తనకు సవాళ్లు విసిరుతున్నారని చెప్పారు. బిహార్ లాంటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సవాళ్లు విసిరుతుంటారని.. అలాంటి వాటి నుంచి తప్పించుకుంటూ వెళుతున్న కుర్రాడిగా అభివర్ణించారు.

రేపొద్దున బిహార్ ముఖ్యమంత్రిగా రూపే తేజ్విస్వి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందననారు. రేపొద్దున తేజస్వీ బిహార్ సీఎం అయినా ఆశ్చర్యపోవద్దన్నారు. కేసులకు వెరవకుండా.. మొక్కోవోని ధైర్యంతో పోరాడుతున్నట్లుగా చెప్పారు. భారత ఎన్నికల కమిషన్ బీజేపీ బ్రాంచ్ లాంటిదన్న రౌత్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న సేన ఎంపీ మాటలు విన్న వేళ.. అదే జరిగితే దేశ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే వీలుందన్నమాట వినిపిస్తోంది.