Begin typing your search above and press return to search.

ఓరినాయనో చిటారు కొమ్మన చిత్రం అంటే ఇదేనేమో..

By:  Tupaki Desk   |   27 Sep 2020 10:50 AM GMT
ఓరినాయనో చిటారు కొమ్మన చిత్రం అంటే ఇదేనేమో..
X
మామూలు చెట్టెక్కి కూర్చున్న కొమ్మనే నరుకుతుంటే ఓ పిచ్చోడిలా చూస్తారు. దీనిపై ఓ సామెత కూడా ఫేమస్. కూర్చున్న కొమ్మనే తెగ నరుక్కునే టైపు అని. అలా ఓ వ్యక్తి చెట్టు కాదు. ఏకంగా ఓ తాటిమానే ఎక్కాడు. అదేమీ చిన్న తాటి మాను కాదు. రికార్డు స్థాయిలో పెరిగినది. దాని హైట్ చూస్తేనే గుండె గుబేలుమనేలా ఉంది. అలాంటిది ఓ వ్యక్తి దాని చిటారు వరకూ ఎక్కి చెట్టు చివరి భాగాన్ని రంపంతో కోయడం మొదలు పెట్టాడు. ఆ చెట్టు అప్పటికే తన పై భాగాన్ని మోయలేక బాహుబలి సినిమాలో యుద్ద సన్నివేశాల్లో కిందకు వాలినట్లు వాలింది. అయినా ఆ వ్యక్తి అప్పటికి కూడా ఆ చెట్టునే పట్టుకుని రంపంతో కోయడం మొదలు పెట్టాడు. ఇది చూసి కింద ఉన్నవారు భయపడిపోయారు. కిందకు దిగు లేదంటే పోతావ్ ..అంటూ కేకలు పెట్టడం మొదలు పెట్టారు. అయినా ఆ వ్యక్తి బెదరలేదు. ఎట్టకేలకు చెట్టు చివరి భాగాన్ని నరికేయడంతో ఆ కొమ్మ అమాంతం గాల్లో వచ్చి కింద పడిపోయాయి. అప్పుడు మొదలైంది. పైన చిత్రం.

ఒక్కసారిగా ఉన్న బరువంతా పోవడంతో చెట్టు తేలికగా మారింది. అప్పటి వరకూ గాల్లో సగం వరకూ వంగి ఉన్న చెట్టు ఉండేలును గట్టిగా లాగి వదిలినట్లు వేగంగా యథాస్థానానికి చేరింది. ఆ వ్యక్తి కింద పడితే ప్రాణాలు పోతాయని గట్టిగా చెట్టును పట్టుకుని అలాగే ఉండిపోయాడు. వేగం తగ్గేవరకు ఆ చెట్టు అటూ ఇటూ కాసేపు ఊగి చివరకు నిటారుగా ఆగడంతో అతడు బతుకు జీవుడా అని చెట్టు నుంచి కిందకు దిగాడు. ఈ తతంగమంతా వీడియో రూపంలో సోషల్ మీడియాలోకి రావడంతో అవి వైరల్గా మారాయి. ఇతడికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయని జోకులు వేస్తున్నారు.