కేసీఆర్ కుటుంబానిదే తెలంగాణ.. ఈటల ఉక్రోశం

Tue May 04 2021 12:00:33 GMT+0530 (IST)

Etela Rajendra Fires On Kcr

మొత్తానికి ఈటల రాజేందర్ బయటపడ్డారు. తెలంగాణ మంత్రి వర్గం నుంచి కేసీఆర్ తీసేశాక ఆయనలోని ఆవేదన ఆక్రందన ఉక్రోశం బయటకు వచ్చింది.తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఎన్నారైలతో వర్చువల్ గా సమావేశమైన ఈటల.. తనను తప్పుడు ఆరోపణలతో బయటకు పంపారని వ్యాఖ్యానించారు.

ఇక తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు లొంగలేదనే కారణంతోనే తనపై నిందలు మోపారని ఆరోపించారు.

ఇక తెలంగాణను మళ్లీ బానిసత్వం వైపు నడిపిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఆ బానిసత్వానికి గులాంగిరీ చేయలేదనే తనను బయటకు పంపారని ఈటల హాట్ కామెంట్స్ చేశారు.

అయితే ఇన్నేళ్లుగా కేసీఆర్ వెంట ఉండి..ఇప్పుడు బయటకు పంపాక ఈటల చేస్తున్న కామెంట్స్ బూమరాంగ్ అవుతున్నాయి. అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకిలా ధైర్యంగా నిలబడలేదని పలువురు కౌంటర్ ఇస్తున్నారు.