Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రాజకీయ వారసుడు కేసీఆర్ యేనట!

By:  Tupaki Desk   |   28 May 2023 5:37 PM GMT
ఎన్టీఆర్ రాజకీయ వారసుడు కేసీఆర్ యేనట!
X
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా టీడీపీని స్థాపించి రాష్ట్రా రాజకీయాల్లో సమూలమైన మార్పులు చేసిన ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద శక పురుషుడు ఎన్టీఆర్ నుఘన నివాళులర్పిస్తున్నారు.

తాజాగా తెలుగుదేశంలో ఒకప్పుడు వెలుగువెలిగి ఇప్పుడు అధికార బీఆర్ఎస్ లో కీలక మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం స్పందించారు. హన్మకొండలోని ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విశ్వవిఖ్యాత నటుడిగా.. పరిపాలన దక్షుడుగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానీయుడు అని పేర్కొన్నారు. రెండు రూపాయలకే కిలోబియ్యం ఇచ్చారని.. పేదలకు ఇళ్లు ఇచ్చారని.. మహిళలకు ఆస్తిలో సమాన ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచిన నేత ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎన్టీఆర్ నిజమైన రాజకీయ వారసుడు సీఎం కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి. ఎన్టీఆర్ ఆశయాలను కేసీఆర్ మాత్రమే పాటిస్తున్నారన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఎన్టీఆర్ తరహాలో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. గతంలో అనేకమార్లు మంత్రి ఎర్రబెల్లి తనకు రాజకీయాల్లో ఎన్టీఆర్, కేసీఆర్ ఇద్దరే నచ్చిన వ్యక్తులని అనేకమార్లు వ్యాఖ్యానించారు.