Begin typing your search above and press return to search.

గాడిదమాంసంతో శృంగార శక్తి.. నిజమేనా?

By:  Tupaki Desk   |   4 May 2021 2:30 PM GMT
గాడిదమాంసంతో శృంగార శక్తి.. నిజమేనా?
X
ఆంధ్రప్రదేశ్ లో గాడిద మాంసానికి గిరాకీ ఎక్కువైంది. చాలా మంది ప్రజలు ఇప్పుడు గాడిద మాంసాన్ని కొనుగులు చేస్తున్నారట.. దీన్ని తినడం వల్ల శృంగార శక్తి పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో ఏపీలో గాడిద మాంసానికి గిరాకీ ఒక్కసారిగా పెరిగింది.

గాడిద మాంసానికి శృంగార కోరికలు పెంచే శక్తి ఉందని.. అంతేకాదు.. ఆస్తమా వంటి శ్వాస సంబంధ వ్యాధులను దూరం చేస్తుందని అనుకుంటున్నారు.అయితే దీనివల్ల గాడిదల జనాభా విపరీతంగా తగ్గుతోందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీకి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి గాడిద మాంసం దిగుమతి అవుతోంది. పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో ఒక్కో గాడది 10వేల నుంచి రూ.20వేలు పలుకుతోంది. ఒక కిలో గాడిద మాంసం ఏపీలో రూ.600గా ఉంది.

ఏపీలో ప్రతీ గురువారం గాడిద మాంసం మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రతీసాగి 100 గాడిదలను తెచ్చి బలి ఇస్తున్నారని సమాచారం. అయితే భారతీయ ఆహార సంరక్షణ చట్టం ప్రకారం గాడిద మాంసం మనుషులు తీసుకునే ఆహారం కాదు.. చట్టవ్యతిరేకంగా ఈ గాడిద మాంసాన్ని అమ్ముతున్నట్టు తేలింది. గాడిదల మాసం తినడం వల్ల శృంగార శక్తి పెరుగుతుందని.. వాటి రక్తం తాగితే పరిగెత్తే శక్తి పెరుగుతుందని ప్రజల్లో ఓ నమ్మకం పెరిగింది.