రూ.15వేలు చెల్లిస్తే శృంగార పార్టీ.. నటి ఆఫర్.. బుక్కైందిలా..

Wed Jul 21 2021 20:00:01 GMT+0530 (IST)

Erotic parties in the farm house

ప్రముఖ తమిళనటి ఒక ఫాంహౌస్ ను రూ.15వేలకు అద్దెకు తీసుకుంది. అందులో తనకు తెలిసిన సెలబ్రెటీలు కుర్రాళ్లు ఆంటీలకు లిక్కర్ శృంగార పార్టీలంటూ భారీగా డబ్బు గుంజింది. ఆ తర్వాత వారితో ఆ ఫాంహౌస్ లో ఎంజాయ్ చేయించింది. అయితే సాఫీగా సాగుతుందని అనుకుంది. ఫాంహౌస్ కు అర్ధనగ్నంగా జంటలు రావడంతో అనుమానం వచ్చి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నటి దందా వెలుగుచూసింది.చెన్నై సిటీలోని సుకునా గార్డెన్ ఎల్ఆర్ ఫార్మ్ రోడ్స్ జంక్షన్ లోని ఈస్ట్ కోడ్ రోడ్డులో ఇసీర్ ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లోని బంగ్లా సినీ తారలు ప్రముఖులతో కళకళలాడుతోంది.  కొంతకాలంగా విలాసివంతమైన కార్లలో ఫామ్ హౌస్ లోకి అర్థనగ్నం దుస్తులు వేసుకుంటున్న అమ్మాయిలు ఆంటీలు యువకులు వచ్చి వెళుతున్నారు. ఎవరెవరో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని స్థానికులకు అనమానం వచ్చి కనతూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అర్ధరాత్రి ఫామ్ హౌస్ మీద కన్నేశారు. అర్ధరాత్రి లోనికి వెళ్లి వారందరికీ షాకిచ్చారు.

ఫాంహౌస్ లోని లగ్జరీ బంగ్లాలో 16మంది పురుషులు 14 మంది మహిళలు ఉన్నారు. ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్లు అందరూ ఫుల్ గా లిక్కర్ పార్టీలు చేసుకుంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఆంటీలు జోరుగా శృంగార డ్యాన్స్ లు చేస్తున్నట్టు పోలీసులు చూసి షాక్ అయ్యారు. పోలీసులను చూసి శృంగార ప్రియులు షాక్ అయ్యి తాగిందంతా దిగడంతో పరుగులు తీశారు. అర్ధనగ్నంగా ఉన్న వారిని పట్టుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసులు ఆరాతీయగా.. ప్రముఖ తమిళనటి ఈ ఫాంహౌస్ ను బుక్ చేసి లిక్కర్ పార్టీ శృంగార పార్టీలు నిర్వహిస్తోందని పోలీసుల విచారణలో తేలింది. సినిమా నటి కావడంతో ఫాంహౌస్ ను ఒక్కరోజుకు రూ.15వేలకు అద్దెకు ఇచ్చారట.. బ్రోకర్ తో కలిసి ఈ దందాను ఆ నటి నిర్వహిస్తోందని విచారణలో వెలుగుచూసింది.

ఈ ప్రముఖ నటి.. గతంలో హీరో దర్శకుడు డ్యాన్స్ మాస్టర్ తో కలిసి నటించింది. తమిళ సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఇక ఈ పార్టీల కోసం నటి స్నేహితుడు బ్రోకర్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ప్రకటన చూసి చాలా మంది నటి బ్రోకర్ ను సంప్రదించి వచ్చి ఫాంహౌస్ లో ఎంజాయ్ చేశారు. మగాళ్లు ఒక్కొక్కరు రూ.15999 ను బ్రోకర్ కు గూగుల్ పే ద్వారా పంపారు. ఆ తర్వాత ఫాంహౌస్ గేట్ లో డబ్బులు చెల్లించిన వారిని మాత్రమే లోపలికి పంపి వారికి లిక్కర్ శృంగార డ్యాన్సులు రూచిచూపించేవారు. ఇప్పుడు వారంతా బుక్కైపోయారు. పోలీసులు నటితోపాటు బ్రోకర్.. పార్టీలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేశారు.