Begin typing your search above and press return to search.

మాటిచ్చా.. ఇండియాకు వస్తున్నా.. ఎలన్ మస్క్ క్లారిటీ

By:  Tupaki Desk   |   14 Jan 2021 7:57 AM GMT
మాటిచ్చా.. ఇండియాకు వస్తున్నా.. ఎలన్ మస్క్ క్లారిటీ
X
డీజిల్.. పెట్రోల్ కార్లకు చెల్లుచీటి చెప్పేసే రోజులు వచ్చేశాయి. మహా అయితే మరో పదేళ్లు.. కాదంటే మరో ఐదేళ్లు. ఇక ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రికల్ కార్లదే. సంప్రదాయ ఇంధన వనరులు.. కాలుష్యానికి చెక్ పెట్టటం లాంటి అంశాలతో పాటు.. అందుబాటులోకి వస్తున్న సరికొత్త టెక్నాలజీతో రానున్న రోజుల్లో వాహనరంగ పరిశ్రమ మొత్తం మారిపోనుంది. టెస్లా కార్ల అధినేత.. ఇటీవలే ప్రపంచ కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మాస్క్ తాజాగా తన భారత ఎంట్రీ గురించి మరోసారి ప్రస్తావించారు.

విద్యుత్ కార్ల తయారీ సంస్థగా పేరున్న టెస్లా భారత్ లోకి ఎప్పుడు ప్రవేశిస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఎలాన్ మస్క్.. త్వరలో వస్తామన్నారు. 2019లో 3.67లక్షల వాహనాల్ని అమ్మిన టెస్లా.. 2020లోనూ తన ఊపును కొనసాగింది. అంతేకాదు.. దాని షేరు విలువ విపరీతంగా పెరిగిపోవటంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు.

విదేశీ మార్కెట్ల మీద ఫోకస్ చేసిన టెస్లా.. భారత్ మార్కెట్ ను తన లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ ను ఇంధనంగా తీసుకొని నడిచే కార్ల తయారీలో తనదైన ముద్ర వేయటమే కాదు.. ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఈ కంపెనీ భారత్ లో తన ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తాజాగా ట్వీట్ చేసిన ఆయన.. భారత్ లోకి రానున్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన మాటకు తగ్గట్లే.. తాము భారత లోకి అడుగు పెట్టనున్నట్లు చెప్పారు.

రిజిస్టార్ ఆఫ్ కంపెనీ వెబ్ సైట్ లో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేయటమే కాదు.. దాని ప్రధాన కార్యాలయ అడ్రెస్ గా కర్ణాటక రాజధాని బెంగళూరును పేర్కొనటం గమనార్హం. తన కంపెనీకి సంబంధించి.. వ్యాపార ఆలోచనలకు సంబంధించిన నిర్ణయాల్ని సోషల్ మీడియాలో ప్రస్తావించే ఎలాన్ మాస్క్.. తాను ప్రామిస్ చేసినట్లుగా భారత్ లోకి అడుగు పెట్టనున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్డీ స్పందిస్తూ.. టెస్లా బెంగళూరులో ఆర్ అం డీ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టెస్లాకు స్వాగమని ఆయన పేర్కొన్నారు. భారత్ లోకి అడుగు పెడుతున్న టెస్లాకు కర్ణాటక రాష్ట్రం శుభాశీస్సులు అని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంతో పాటు.. గుజరాత్.. మహారాష్ట్ర.. తమిళనాడు.. ఏపీ ప్రభుత్వాలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం టెస్లా కంపెనీపై కేంద్రమంత్రి గడ్కరీ సైతం స్పందించారు. ఆయన మాటల ప్రకారం ఈ ఏడాది చివరికి టెస్లా నుంచి కార్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. కొత్త కార్ల మార్కెట్ కు సరికొత్త జోష్ వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా వెలుపుల నిర్మిస్తున్న టెస్లా అతి పెద్ద ఆర్ ఎండ్ డీ కేంద్రం భారత్ లోనే ఏర్పాటు చేయనున్నారు.