Begin typing your search above and press return to search.

కరోనా చికిత్స పరిశోధనపై 14 ఏళ్ల తెలుగమ్మాయి ఘన విజయం

By:  Tupaki Desk   |   20 Oct 2020 9:30 AM GMT
కరోనా చికిత్స పరిశోధనపై 14 ఏళ్ల తెలుగమ్మాయి ఘన విజయం
X
ప్రపంచాన్ని వణికించిన కరోనాకు ముకుతాడు వేసేందుకు.. దానికి చెక్ చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలోని 3ఎం ఛాలెంజ్ సంస్థ యంగ్ సైంటిస్టు చాలెంజ్ ను నిర్వహించింది. కరోనా చికిత్సలో సార్స్ కోవ్ 2 ప్రోటీన్ కు చెక్ పెట్టే అణువును అమెరికాలోని తెలుగమ్మాయి గుర్తించింది. ఏపీకి చెందిన అనికా చేబ్రోలు అమెరికాలో తల్లిదండ్రులతో పాటు ఉంటోంది. పద్నాలుగేళ్ల ఈ బాలిక.. తాజా చాలెంజ్ ను స్వీకరించటమే కాదు.. ఆమె సాధించిన ఫలితానికి భారీ బహుమానాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం అమెరికాలో ఎనిమిదో తరగతి చదువుతున్న అనికా.. గత ఏడాది తీవ్రమైన జ్వరంతో బాధ పడింది.దీంతో.. ఇన్ ఫ్లుయెంజాకు మందు కనిపెట్టాలని బలంగా భావించింది. ఇందులో భాగంగా కరోనా వైరస్ నిర్మూలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఆమె సార్స్ కోవ్ 2 ప్రోటీన్ ను కట్టడి చేసే అణువును గుర్తించింది. ఈ విధానం కోవిడ్ కు చికిత్సకు కీలకంగా మారుతుందని 3ఎం చాలెంజ్ సంస్థ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో అనికాకు 25వేల అమెరికన్ డాలర్ల బహుమానాన్ని ప్రకటించింది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.18.33 లక్షలుగా చెప్పాలి. కీలకమైన అంశంపై ఇంత చిన్న విషయంలో సాధించిన విజయం ఒక ఎత్తు అయితే.. ఆమె తెలుగు ప్రాంతానికి చెందిన బాలిక కావటం మరింత సంతోషానికి గురి చేసే అంశంగా చెప్పక తప్పదు.