మాజీ మంత్రి ఈటలతో కీలక మహిళా నేత భేటి

Sun May 16 2021 15:00:01 GMT+0530 (IST)

Eeta rajender key meeting with Konda Surekha

మాజీ మంత్రి ఈటల రాజేందర్ అడుగులు సీఎం కేసీఆర్ వ్యతిరేకవర్గం వైపు పడుతున్నాయి. కేసీఆర్ వ్యతిరేకించే వారితో ఈటల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన దారి ఎటు అనే చర్చ ఇప్పుడు సాగుతోంది.మాజీ మంత్రి ఈటల రాజేందర్ గత కొన్ని రోజులుగా పలువురు నేతలతో వరుసగా భేటి అవుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

తాజాగా ఈటల కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖతో భేటి అయ్యారు. రాజకీయ భవిష్యత్ పై చర్చిస్తున్నట్టు సమాచారం.

ఈటలను మంత్రివర్గం నుంచి కేసీఆర్ తొలగించిన తర్వాత వరుసగా కీలక నేతలతో ఈటల సమావేశం అవుతున్నారు. డీఎస్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సహా కాంగ్రెస్ నేతలతో భేటి అయ్యారు.

ఇక తన నియోజకవర్గంలోని నేతలు ప్రజలపై గొర్రెల మందపై తోడేలు దాడి చేసినట్లుగా చేస్తున్నారని ఈటల తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమాలతో సంబంధం లేని మంత్రి సీఎం కేసీఆర్ ఇన్ చార్జీలు హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్ లు ఇతర ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఈటల ఆరోపించారు.