Begin typing your search above and press return to search.

రోజుకు 60 గ్రాములు వాటిని తింటే.. శృంగారంలో నెక్ట్స్ లెవల్!

By:  Tupaki Desk   |   30 May 2023 9:50 AM GMT
రోజుకు 60 గ్రాములు వాటిని తింటే.. శృంగారంలో నెక్ట్స్ లెవల్!
X
చిన్న చిన్న ఆహార అలవాట్లలో వచ్చే మార్పులు.. పెద్ద మార్పులకు కారణం అవుతుంది. ఇదే విషయాన్ని తాజాగా చేపట్టిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. శృంగారం జీవితాన్ని మెరుగుపర్చుకోవటానికి ఏం చేయాలన్న అంశంపై జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

తాజా పండ్లు.. కూరగాయలు తక్కువగా ఉండే ప్రాశ్చత్య దేశాల్లోని ఆహార అలవాట్లపై కొందరు చేసిన పరిశోధనలో జీడిపప్పు.. బాదంపప్పు.. అక్రోట లాంటి నట్స్ చేసే మేలు ఎంతన్న విషయాన్ని గుర్తించారు.

తాము తీసుకునే రెగ్యులర్ ఆహారంతో పాటు జీడిపప్పు.. బాదంపప్పు.. అక్రోట్లు.. హేజల్ నట్స్ లాంటివి తినమని సూచించారు. క్రమం తప్పకుండా రోజు 60 గ్రాములు తినాలని చప్పారు.

అలా తినటం స్టార్ట్ చేసిన వారు 14 వారాల తర్వాత.. వారిని పరిశీలించగా.. నట్స్ తిన్న వారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు.. భావప్రాప్తి మెరుగుపడినట్లుగా తేలింది.

నట్స్ లోని ప్రొటీన్.. పీచు పదార్థాలతో పాటు విటమిన్లు.. ఖనిజాలు దండిగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇలా రోజు వారీగా నట్స్ ను తినే వారిలో బరువును అదుపులో ఉంచుకోవటంతో పాటు ఉత్సాహం.. మేధోశక్తి.. మూడ్ పుంజుకున్న విషయాన్ని గుర్తించారు. ఇవన్నీ శృంగార జీవితాన్ని మరో లెవల్ కు తీసుకెళతాయని చెబుతున్నారు.

నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకునే వారిలో శృంగార ఆసక్తితో పాటు భావప్రాప్తి మెరుగుపడినట్లుగా గుర్తించారు. నట్స్ లోని పాలీ ఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు స్తంభన లోపాల్ని తగ్గించటంతో పాటు గుండె రక్త నాళ వ్యవస్థకు మేలు చేస్తుందన్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆరోగ్య కరమైన ఆహారానికి నట్స్ ను జత చేస్తే అంగస్తంభన మెరుగు అవుతుందని తేల్చారు. సో.. రోజుకు 60 గ్రాముల నట్స్.. కొత్త ఉత్సాహానికి కారణమవుతుందన్న మాట.